TG DOST Special Drive 2026 : దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ కౌన్సెలింగ్ అప్డేట్ - వెబ్ ఆప్షన్లు ప్రారంభం
TG DOST Special Drive 2026 Web Options : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ స్పెషల్ డ్రైవ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఓవైపు రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా... తాజాగా వెబ్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.అభ్యర్థులకు ఆగస్టు 14, 2026న సీట్లను కేటాయిస్తారు.
TG DOST Special Drive 2026 : రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ (DOST) స్పెషల్ డ్రైవ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా.... తాజాగా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు, కళాశాలలను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను కూడా ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు దోస్త్‌లో సీటు పొందని వారు, కొత్తగా అప్లై చేయాలనుకుంటున్న విద్యార్థులకు ఇది చివరి అవకాశంగా అధికారులు తెలిపారు.

ముఖ్య తేదీలు:
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు : కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆగస్టు 11, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అభ్యర్థులు రూ.400 రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
- వెబ్ ఆప్షన్ల ఎంపిక : రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు తమ ప్రాధాన్యత ఆధారంగా కోర్సులు, కాలేజీలను ఎంచుకోవడానికి ఆగస్టు 12, 2026 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చే వెసులుబాటును కల్పించారు.
- ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేషన్ల పరిశీలన: PH, CAP, NCC, స్పోర్ట్స్ మరియు ఇతర ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ (ECA) సర్టిఫికేట్లు ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ఆగస్టు 12, 2026న సంబంధిత విశ్వవిద్యాలయ హెల్ప్ లైన్ సెంటర్లలో (UHLCs) నిర్వహిస్తారు.
- సీట్ల కేటాయింపు : వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు మార్కుల మేధస్సు, రిజర్వేషన్ల ఆధారంగా ఆగస్టు 14, 2026న స్పెషల్ డ్రైవ్ సీట్లను కేటాయిస్తారు.
- ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ : సీటు పొందిన అభ్యర్థులు ఆగస్టు 14, 2026 నుండి ఆగస్టు 18, 2026 వరకు ఆన్‌లైన్ విధానంలోనే సీటును ఖరారు చేసుకుంటూ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
- కాలేజీల్లో నేరుగా రిపోర్టింగ్ : ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తయిన అభ్యర్థులు ఆగస్టు 17, 2026 నుండి ఆగస్టు 18, 2026 మధ్య తమకు కేటాయించిన కళాశాలకు నేరుగా వెళ్లి సర్టిఫికెట్లు సమర్పించి ప్రవేశాన్ని స్థిరీకరించుకోవాలి.
TS DOST 2026 స్పెషల్ డ్రైవ్ - రిజిస్ట్రేషన్ ఇలా :
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించండి.
2. హోం పేజీలో అందుబాటులో ఉన్న TS DOST 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవాలి.
4. నమోదు పూర్తయిన తర్వాత, దరఖాస్తు పత్రాన్ని పూరించండి.
5. దరఖాస్తు రుసుము చెల్లించండి.
6. సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
7. తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని భద్రపరచుకోండి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

