...
...
Next Story

TS EAMCET 2026 : ఈరోజు టీజీ ఈఏపీసెట్ 2026 మెుదటి రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోవాలి

TG EAPCET 2026 Round 1 Seat Allotment : టీజీ ఈఏపీసెట్ 2026 మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలను జూలై 10న రానున్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియ మొదటి దశలో పాల్గొన్న అభ్యర్థులు, తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.inలోకి లాగిన్ అయి చూసుకోవచ్చు.

Updated on: Jul 10, 2026, 11:46:44 IST
Advertisement

TS EAMCET 2026 : తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) జూలై 10న TG EAPCET 2026 మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేయనుంది. మొదటి దశ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ అలాట్‌మెంట్ స్టేటస్‌ను తనిఖీ చేసుకోవచ్చు.

టీజీ ఈఏపీసెట్ ఫలితాలు 2026
టీజీ ఈఏపీసెట్ ఫలితాలు 2026

అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి.. కౌన్సెలింగ్ ప్రక్రియ ఆధారంగా తమకు కేటాయించిన కాలేజీ, కోర్సు వివరాలను తెలుసుకోవచ్చు.

అభ్యర్థులకు జూలై 5 నుండి జూలై 7 వరకు వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ సమయంలో విద్యార్థులు కొత్త కాలేజీలు లేదా కోర్సులను జోడించడం, వద్దనుకున్న ఆప్షన్లను తొలగించడం లేదా ప్రాధాన్యత క్రమాన్ని మార్చుకోవడం వంటివి చేశారు. జులై 7తో ఈ విండో ముగియడంతో, అభ్యర్థులు నమోదు చేసిన ఆఖరి ఆప్షన్ల ఆధారంగా ఈ మొదటి విడత సీట్లను కేటాయించారు.

కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం, మొదటి రౌండ్‌లో సీటు పొందిన విద్యార్థులు తమ సీటును కన్ఫామ్ చేసుకోవడానికి నిర్దేశిత గడువులోగా ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. జులై 10 నుండి జులై 14, 2026 వరకు గడువు తేదీ ఉంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి, అధికారిక వెబ్‌సైట్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఈ 2026 విద్యా సంవత్సరానికి గాను సుమారు 320 విద్యా సంస్థలు ఈ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొంటున్నాయి.

TG EAPCET సీట్ల కేటాయింపు ఎలా చెక్ చేసుకోవాలి?

  • మొదట అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.in ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే 'Candidates Login' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. వెంటనే స్క్రీన్‌పై సీట్ల కేటాయింపు ఫలితం కనిపిస్తుంది.
  • భవిష్యత్తు అవసరాల కోసం విద్యార్థులు ఆ అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ కాపీని భద్రపరుచుకోవాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe