TG EAPCET 2026 Engineering Hall Ticket : రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఈఏపీసెట్ - 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… ఇవాళ్టి నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TG EAPCET హాల్ టికెట్ - డౌన్లోడ్ ఇలా
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tsche.ac.in/ సందర్శించాలి.
- హోం పేజీలో కనిపించే 'Download Hall Ticket(E)' లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ (ఇంటర్) హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత 'Get Hall Ticket' బటన్ నొక్కితే స్క్రీన్‌పై మీ హాల్ టికెట్ కనిపిస్తుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.

మీ హాల్ టికెట్‌పై అభ్యర్థి పేరు, ఫోటో, పరీక్షా కేంద్రం చిరునామా, పరీక్ష సమయం స్పష్టంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లడం తప్పనిసరి.
ఇప్పటికే అగ్రికల్చర్ - ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లను విడుదల చేశారు.
TG EAPCET 2026 ఎగ్జామ్ తేదీలు:
టీజీ ఈఏపీసెట్ -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే…. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
ఈ పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరించిన… అనంతరం ర్యాంకులను ప్రకటిస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.