...
...
Next Story

TG EAPCET 2026 Counselling : టీజీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అప్డేట్ - వెబ్ ఆప్షన్లకు ఇవాళే చివరి తేదీ

TG EAPCET 2026 Final Phase Counselling : టీజీ ఈఏపీసెట్ చివరి విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల గడువు నేటితో ముగియనుంది. మూడో విడతలో సీటు రద్దు చేసుకుంటే ఫీజు తిరిగి ఇవ్వరని అధికారులు స్పష్టం చేశారు.

Published on: Aug 2, 2026, 06:02:42 IST
Advertisement

TG EAPCET 2026 Final Phase Counselling : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ అందుబాటులో ఉంది. అయితే ఈ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి ఇచ్చిన గడువు నేటితో(ఆగస్ట్ 2) ముగియనుంది.

ఆగస్టు 5న సీట్ల కేటాయింపు

టీజీ ఈఏపీసెట్ ఆఖరి విడత కౌన్సెలింగ్
టీజీ ఈఏపీసెట్ ఆఖరి విడత కౌన్సెలింగ్

టీజీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం… తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను ఆగస్టు 5 నాటికి పూర్తి చేసి, ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7వ తేదీ మధ్య ఆన్‌లైన్ విధానంలో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం , అప్‌డేట్స్ కోసం https://tgeapcet.nic.in/default.aspx అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఈ ఆఖరి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న అభ్యర్థులకు ప్రవేశాల కమిటీ అధికారులు అత్యంత ముఖ్యమైన సూచన చేశారు. ఈ విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన తర్వాత, ఏదైనా కారణంతో ఆ సీటును రద్దు చేసుకుంటే.. అప్పటికే చెల్లించిన ట్యూషన్ ఫీజును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వరని (నో రీఫండ్) అధికారులు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ఖచ్చితంగా చేరడానికి ఆసక్తి ఉన్న కళాశాలలు, కోర్సులను మాత్రమే ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

TG EAPCET చివరి విడత కౌన్సెలింగ్ - తేదీలు

  • ఆగస్టు 2 చివరి తేదీ : విద్యార్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సుల కోసం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
  • ఆగస్టు 5 నాటికి : మూడో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి, ఫలితాలను వెల్లడిస్తారు.
  • ఆగస్ట్ - ఆగస్ట్ 7వ తేదీ : ఆన్ లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి.
  • ఆగస్ట్ 7 వరకు : కాలేజీలో రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి.
  • అధికారిక వెబ్ సైట్ - https://tgeapcet.nic.in/default.aspx

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe