TG EAPCET 2026 Counselling : టీజీ ఈఏపీసెట్ అభ్యర్థులకు అప్డేట్ - నేటి నుంచి తుది విడత కౌన్సెలింగ్, ముఖ్య సమాచారం

TG EAPCET 2026 Final Phase Counselling : టీజీ ఈఏపీసెట్ చివరి విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ శుక్రవారం(జూలై 31) నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 5 నాటికి విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు.

Published on: Jul 31, 2026, 13:31:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG EAPCET 2026 Final Phase Counselling : తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. టీజీ ఈఏపీసెట్ (TG EAPCET 2026) చివరి విడత ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ శుక్రవారం(నేటి) నుంచి ప్రారంభమైంది . మొదటి రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత…. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో మిగిలి ఉన్న సీట్లను ఈ విడత ద్వారా భర్తీ చేయనున్నారు.

టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2026
టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2026

రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాల ప్రకారం మొత్తం 80,167 మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ సీట్లు దక్కాయి. అయితే… అందులో 71,452 మంది విద్యార్థులు మాత్రమే సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేసి ప్రవేశాలు పొందారు. సీట్లు పొందినప్పటికీ దాదాపు 9,000 మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపలేదు.

ఫలితంగా…. ఆ సీట్లతో పాటు మిగిలిన ఖాళీలను కలిపి చివరి విడత కౌన్సెలింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం చివరి విడత కౌన్సెలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22,972 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ చివరి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులకు అధికారులు మరో అలర్ట్ ఇచ్చారు. మూడో విడతలో సీటు పొంది, ఆ తర్వాత ఏదైనా కారణంతో సీటును రద్దు చేసుకుంటే…. ఇప్పటికే చెల్లించిన ఫీజును తిరిగి ఇవ్వరని (నో రీఫండ్) స్పష్టం చేశారు. ఫలితంగా విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, కచ్చితంగా చేరాలనుకునే కళాశాలలు, కోర్సులను మాత్రమే ఎంచుకోవాలని సూచించారు.

TG EAPCET చివరి విడత కౌన్సెలింగ్ - తేదీలు

  • జులై 31 (శుక్రవారం) : కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రాసెస్ ఫీజు చెల్లించి, స్లాట్ బుకింగ్(రిజిస్ట్రేషన్) చేసుకోవచ్చు.
  • ఆగస్టు 1 : స్లాట్ బుక్ చేసుకున్న కొత్త అభ్యర్థులకు ధ్రువపత్రాల (సర్టిఫికెట్ల) పరిశీలన ఉంటుంది.
  • ఆగస్టు 1, 2 తేదీలు : విద్యార్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సుల కోసం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
  • ఆగస్టు 5 నాటికి : మూడో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి, ఫలితాలను వెల్లడిస్తారు.
  • ఆగస్ట్ - ఆగస్ట్ 7వ తేదీ : ఆన్ లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి.
  • ఆగస్ట్ 7 వరకు : కాలేజీలో రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి.
  • అధికారిక వెబ్ సైట్ - https://tgeapcet.nic.in/default.aspx
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More