TG EAPCET 2026 Preliminary Keys : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ (TG EAPCET) 2026కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. సోమవారంతో ఇంజినీరింగ్ పరీక్షలు విజయవంతంగా ముగియగా.... పరీక్షా విభాగం వెనువెంటనే అగ్రికల్చర్, ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన ప్రాథమిక కీ (Preliminary Key) తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు, మాస్టర్ ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. వీటిని అధికారిక వెబ్‌సైట్(eapcet.tsche.ac.in)లో చెక్ చేసుకోవాలని సూచించింది.
భారీగా హాజరైన విద్యార్థులు….

ఈ ఏడాది ఇంజినీరింగ్ పరీక్షలను మొత్తం ఆరు షిఫ్టుల్లో నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 2,10,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,97,241 (దాదాపు 93.5%) మంది పరీక్షకు హాజరైనట్లు పరీక్ష కన్వీనర్ విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి విద్యార్థుల హాజరు శాతం ఆశాజనకంగా ఉందని అధికారులు భావిస్తున్నారు.
కీ, అభ్యంతరాల నమోదు వివరాలు
పరీక్ష రాసిన అభ్యర్థులు eapcet.tsche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి. వారి రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి వెబ్‌సైట్ నుంచి రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రాథమిక కీలను కూడా పొందొచ్చు.
- అగ్రికల్చర్ విభాగం: ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు మే 13వ తేదీ ఉదయం 11:30 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
- ఇంజినీరింగ్ విభాగం: ఇంజినీరింగ్ కీపై అభ్యంతరాలను మే 14వ తేదీ ఉదయం 11:00 గంటల వరకు పంపేందుకు అవకాశం కల్పించారు.
- నిర్దేశించిన గడువు తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యంతరాలను సమర్పించేటప్పుడు సరైన ఆధారాలను (Supporting Documents) జత చేయడం తప్పనిసరి.
టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు ఎప్పుడు?
ప్రాథమిక కీపై వచ్చే అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం తుది కీని సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మరో 10 రోజుల్లోనే తెలంగాణ ఎప్‌సెట్ - 2026 తుది ఫలితాలను విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. జూన్ మొదటి వారంలోపే ర్యాంకుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
{{/usCountry}}ప్రాథమిక కీపై వచ్చే అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం తుది కీని సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మరో 10 రోజుల్లోనే తెలంగాణ ఎప్‌సెట్ - 2026 తుది ఫలితాలను విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. జూన్ మొదటి వారంలోపే ర్యాంకుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
{{/usCountry}}