రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీతో గడువు ముసిగింది. ఈ తేదీలోపు భారీగానే దరఖాస్తులు వచ్చాయి.
భారీగానే దరఖాస్తులు…

శనివారం నాటికి 2.90 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. లేట్ ఫీజుతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇందులోనూ అత్యధికంగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష కోసం 2 లక్షలకుపైగా దరఖాస్తులు దాటాయి. బైపీసీ స్ట్రీమ్ పరీక్షకు 87 వేల వరకు వచ్చాయి. ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఫార్మసీ కోసం (రెండు కలిపి) దాదాపు 300 మంది వరకు దరఖాస్తులు సమర్పించారు. అమ్మాయిల నుంచి అధిక సంఖ్యలో అందాయి.
గతేడాది టీజీ ఈఏపీసెట్ కు మూడు లక్షల దరఖాస్తులు అందాయి. అయితే ఆలస్య రుసుంతో కూడా చాలా మంది దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే… ఈసారి కూడా దరఖాస్తుల సంఖ్య 3 లక్షలు దాటొచ్చని అంచనా.
ఇంజినీరింగ్ స్ట్రీమ్ అప్లికేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 900 చెల్లించాలి. ఇక అగ్రికల్చర్ స్ట్రీమ్ కింద ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 900 చెల్లించాలి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ కు కలిపి దరఖాస్తు చేసుకునేంటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 1000, ఇతరులు రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 4వ తేదీ వరకు మాత్రమే ఈ ఫీజులున్నాయి.ఈ తేదీ పూర్తి కావటంతో…. ఈ ఫీజుతో పాటు ఆలస్య రుసుంను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ https://eapcet.tgche.ac.in/ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.
- రూ. 250 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 10-04-2026.
- రూ. 500 ఫైన్ తో చివరి తేదీ - 15-04-2026.
- రూ. 2,500 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 20-04-2026.
- రూ. 5,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 24-04-2026.
- రూ. 10,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - : 02-05-2026.
టీజీ ఈఏపీసెట్ -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే…. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరించిన… అనంతరం ర్యాంకులను ప్రకటిస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.
{{/usCountry}}టీజీ ఈఏపీసెట్ -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే…. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరించిన… అనంతరం ర్యాంకులను ప్రకటిస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.
{{/usCountry}}