రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తులకు గడువు దగ్గరపడింది. ఎలాంటి ఫైన్ లేకుండా ఇవాళ్టి వరకే (ఏప్రిల్ 4) అవకాశం ఉంది. ఈ తేదీ దాటితే… నిర్దేశించిన ఫీజుతో పాటు ఆలస్య రుసుం కూడా చెల్లించాలి. కాబట్టి అర్హులైన విద్యార్థులు…. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అదికారులు సూచిస్తున్నారు.

ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఫైన్ తో అయితే… మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పరీక్షా జోన్‌లను ఎంచుకునే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 టెస్ట్ జోన్లు ఉండగా…. 10కిపైగా జోన్లు ఇప్పటికే నిండిపోయాయి.
ఇంజినీరింగ్ స్ట్రీమ్ అప్లికేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 900 చెల్లించాలి. ఇక అగ్రికల్చర్ స్ట్రీమ్ కింద ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 900 చెల్లించాలి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ కు కలిపి దరఖాస్తు చేసుకునేంటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 1000, ఇతరులు రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 4వ తేదీ వరకు మాత్రమే ఈ ఫీజులుంటాయి. తేదీ మారితే…ఈ ఫీజుతో పాటు ఆలస్య రుసుంను కూడా చెల్లించాలి.
TG EAPCET 2026 పరీక్ష తేదీలు…..
టీజీ EAPCET -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే.. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరించిన… అనంతరం ర్యాంకులను ప్రకటిస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.
టీజీ ఈఏపీసెట్ 2026 - ముఖ్యమైన తేదీలు
టీజీ ఈఏపీసెట్ దరఖాస్తులకు చివరి తేదీ - 4 ఏప్రిల్ 2026.
{{/usCountry}}టీజీ ఈఏపీసెట్ దరఖాస్తులకు చివరి తేదీ - 4 ఏప్రిల్ 2026.
{{/usCountry}}రూ. 250 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 10-04-2026.
రూ. 500 ఫైన్ తో చివరి తేదీ - 15-04-2026.
రూ. 2,500 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 20-04-2026.
రూ. 5,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 24-04-2026.
రూ. 10,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - : 02-05-2026.
అధికారిక వెబ్ సైట్ - https://eapcet.tgche.ac.in/