...
...
Next Story

TG EAPCET 2026 Counselling : వెబ్ ఆప్షన్లు మార్చుకోవాలనుకుంటున్నారా..? ఇదే చివరి ఛాన్స్!

TG EAPCET 2026 మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను మార్చుకోవడానికి జూలై 7 వరకు గడువు ఇచ్చారు. జూలై 10న ఫైనల్ సీట్ల కేటాయింపు జరగనుంది.

Published on: Jul 6, 2026, 10:49:41 IST
Advertisement

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ (TG EAPCET 2026) కౌన్సెలింగ్ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు నమోదు చేసుకున్న ఐచ్ఛికాల ఆధారంగా అధికారులు మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయింది. అభ్యర్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందో ఒక అంచనాకు రావడానికి ఈ మాక్ అలాట్‌మెంట్ ఎంతో ఉపయోగపడుతుంది.

తెలంగాణ ఈఏపీసెట్ - 2026
తెలంగాణ ఈఏపీసెట్ - 2026

మాక్ అలాట్‌మెంట్ ఫలితాలను చూసుకున్న తర్వాత, అభ్యర్థులు ఎవరైనా తమ ప్రాధాన్యాలను మార్చుకోవాలని భావిస్తే వారికి అధికారులు మరో అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి జూలై 5 నుంచి జూలై 7 వరకు గడువు ఇచ్చారు.

ఒకవేళ అభ్యర్థులు తమ ఆప్షన్లను మార్చకపోతే, మాక్ అలాట్‌మెంట్ కోసం గతంలో పెట్టుకున్న ఆప్షన్లనే మొదటి విడత సీట్ల కేటాయింపునకు తుది ఆప్షన్లుగా పరిగణిస్తామని కౌన్సెలింగ్ విభాగం స్పష్టం చేసింది.

సీట్ల కేటాయింపు ఎప్పుడంటే… ?

షెడ్యూల్ ప్రకారం…. జూలై 7వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత జూలై 10వ తేదీన లేదా అంతకంటే ముందే మొదటి విడత ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు ఫలితాలను వెబ్‌సైట్‌లో అధికారికంగా విడుదల చేస్తారు.

సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 10 నుండి జూలై 14 మధ్య కాలంలో ఆన్‌లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారానే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు గడువు తేదీలను గమనించి, తదనుగుణంగా తమ వెబ్ ఆప్షన్లను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.

జులై 17 నుంచి రెండో విడత కౌన్సెలింగ్

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe