TG ECET Spot Admissions : టీజీ ఈసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల - గైడ్‌లైన్స్, తేదీలివే
TG ECET Spot Admission Schedule 2026 : టీజీ ఈసెట్ 2026 స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ నెల 17వ తేదీ నాటికి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు.
TG ECET Spot Admission Schedule 2026 : డిప్లొమా (పాలిటెక్నిక్), బీఎస్సీ పూర్తి చేసి నేరుగా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ) చేరాలనుకునే విద్యార్థులకు అలర్ట్ వచ్చేసింది. తెలంగాణ ఈసెట్ (TGECET-2026) స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. ప్రైవేట్, ప్రభుత్వ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఈ స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు.

టీజీ ఈసెట్ స్పాట్ అడ్మిషన్లు - తేదీలు
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 15-07-2026
- దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 16-07-2026
- కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహణ: 17-07-2026
అర్హతలు…
- మొదటి ప్రాధాన్యత: టీజీ ఈసెట్ 2026 (TGECET-2026) ఎగ్జామ్‌లో క్వాలిఫై అయి, సంబంధిత డిప్లొమా లేదా బీఎస్సీ పరీక్షల్లో ఓసీ అభ్యర్థులు కనీసం 44.5 శాతం, బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 39.5 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.
- రెండో ప్రాధాన్యత : ఈసెట్ పరీక్ష రాయకపోయినా లేదా క్వాలిఫై కాకపోయినా.. డిప్లొమా/బీఎస్సీ పరీక్షల్లో ఓసీలు 44.5 శాతం మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీల (BC/SC/ST) వారు 39.5 శాతం మార్కులు సాధించిన వారికి మిగిలిన సీట్లలో అవకాశం కల్పిస్తారు.
- అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లను మొదట పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లతో భర్తీ చేస్తారు. ఆ తర్వాత కూడా సీట్లు మిగిలిపోతేనే బీఎస్సీ (మ్యాథ్స్ గ్రూప్ సబ్జెక్టుగా చదివిన వారు) అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు.
- లోకల్ లేదా నాన్-లోకల్ నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వారికే సీట్లు కేటాయిస్తారు. 1974 ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (నియంత్రణ మరియు ప్రవేశాల) ఉత్తర్వుల ప్రకారం ఓయూ (ఉస్మానియా యూనివర్సిటీ) పరిధిలోని లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లు అన్‌రిజర్వ్‌డ్ కోటా కింద భర్తీ చేస్తారు.
మీ వద్ద ఉండాల్సిన పత్రాలు
టీజీ ఈసెట్ - 2026 స్పాట్ అడ్మిషన్ల వెరిఫికేషన్ సమయానికి అభ్యర్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో నేరుగా కళాశాలలకు హాజరుకావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లను వెనక్కి ఇచ్చేస్తారు. విద్యార్థులు ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (T.C) తో పాటు మిగిలిన సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను కాలేజీలో సమర్పించాలి.
- డిప్లొమా లేదా బీఎస్సీ ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్.
- మూడేళ్ల మార్కుల మెమో.
- స్టడీ సర్టిఫికెట్లు (Study Certificates).
- రెసిడెన్స్ సర్టిఫికేట్.
- టీజీ ఈసెట్ 2026 ర్యాంక్ కార్డ్ మరియు హాల్ టికెట్ (అర్హత సాధించిన వారైతే)
- అవసరమైన కేటగిరీల వారికి కుల ధ్రువీకరణ పత్రం.
- ప్రాసెసింగ్ ఫీజు వివరాలు : టీజీ ఈసెట్ 2026 లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు: రూ. 1300, క్వాలిఫై కాని అభ్యర్థులకు - రూ. 2100 చెల్లించాలి.
- అధికారిక వెబ్ సైట్ - https://tgecet.nic.in/default.aspx
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

