TG EdCET 2026 Hall Ticket : తెలంగాణ ఎడ్‌సెట్‌ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG EdCET 2026 Hall Ticket Download : తెలంగాణ ఎడ్ సెట్ - 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈనెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) జరగనుంది. అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: May 11, 2026, 05:12:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG EdCET 2026 Hall Ticket Download: రాష్ట్రంలోని బీఈడీ (B.Ed) కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 పరీక్షకు సర్వం సిద్ధమైంది. తాజాగా ఈ ఈ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటంది.

తెలంగాణ ఎడ్ సెట్ 2026 హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ ఎడ్ సెట్ 2026 హాల్ టికెట్లు విడుదల

మే 12న జరగనున్న ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ బీఈడీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు కల్పిస్తారు. మే 12న ఉదయం 10:00 నుండి 12:00 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:00 నుంచి 4:00 వరకు మరో సెషన్ ఉంటుంది.

టీజీ ఎడ్ సెట్ ప్రాథమిక కీ మే 15న విడుదల కానుంది. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారు. మే 30న తుది ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.

టీజీ ఎడ్‌సెట్‌ 2026 హాల్ టికెట్ : డౌన్లోడ్ ఎలా చేయాలి?

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ edcet.tgche.ac.in ను సందర్శించండి.
  2. హోమ్ పేజీలో ఉన్న 'Download Hall Ticket' లింక్‌పై క్లిక్ చేయండి.
  3. మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ (DOB) వివరాలను నమోదు చేయండి.
  4. 'గెట్ హాల్ టికెట్' పై క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  5. దానిని ప్రింట్ తీసుకుని పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.

హాల్ టికెట్‌తో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఒక చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి. పరీక్షా కేంద్రానికి కనీసం గంటన్నర ముందుగానే వెళ్లటం ఉత్తమం. హాల్ టికెట్‌పై ఉన్న మీ పేరు, ఫోటో, సంతకం మరియు పరీక్షా కేంద్రం వివరాలను సరిచూసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.

ఈసారి కూడా ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షను కాకతీయ యూనివర్శిటీ నిర్వహించనుంది. ఎంట్రెన్స్ పరీక్షలో అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహణ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి… సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ ఫేజ్ లు పూర్తి అయి సీట్లు మిగిలితే… స్పాట్ అడ్మిషన్లపై నిర్ణయం తీసుకుంటారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More