Telangana Temple Executive Officers : రాష్ట్రంలోని దేవాలయాల పరిపాలన, పారదర్శకతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో పోస్టులను మంజూరు చేసింది. దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే వివిధ గ్రేడ్ల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 30న ఉత్తర్వులు జారీ చేసింది.
పోస్టుల వివరాలు :

ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం 190 పోస్టులను మూడు కేటగిరీలుగా విభజించారు.
- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I : 41 పోస్టులు
- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-II : 62 పోస్టులు
- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III : 87 పోస్టులు
రాష్ట్రంలోని 7 జోన్ల వారీగా పోస్టుల కేటాయింపును పరిశీలిస్తే…. అత్యధిక దేవాలయాలు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.
- చార్మినార్ జోన్ (జోన్-6): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలతో కూడిన ఈ జోన్‌కు అత్యధికంగా 67 పోస్టులు లభించాయి. ఇందులో 10 గ్రేడ్-1, 27 గ్రేడ్-2 మరియు 30 గ్రేడ్-3 పోస్టులు ఉన్నాయి.
- యాదాద్రి-భువనగిరి జోన్ (జోన్-5): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఉన్న ఈ జోన్‌కు 48 పోస్టులు దక్కాయి. ఇక్కడ గ్రేడ్-3 పోస్టులు అత్యధికంగా 27 ఉండటం గమనార్హం.
- జోగులాంబ జోన్ (జోన్-7): గద్వాల, నాగర్‌కర్నూల్ వంటి ప్రాంతాలు ఉన్న ఈ జోన్‌కు 28 పోస్టులు కేటాయించారు.
- భద్రాద్రి-కొత్తగూడెం జోన్ (జోన్-4): దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి జోన్‌కు 20 పోస్టులు మంజూరు చేశారు. ఇక్కడ 9 గ్రేడ్-1 పోస్టులు ఉన్నాయి.
- బాసర జోన్ (జోన్-2): నిర్మల్, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని ఈ జోన్‌కు 14 పోస్టులు కేటాయించారు.
- రాజన్న జోన్ (జోన్-3): ఈ జోన్‌కు 7 పోస్టులు దక్కాయి.
- కాళేశ్వరం జోన్ (జోన్-1): ఈ జోన్‌కు అత్యల్పంగా 6 పోస్టులు కేటాయించారు.
రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా భక్తుల రద్దీ పెరగడం, ఆలయాల ఆదాయం వృద్ధి చెందడంతో పరిపాలనలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అనేక దేవాలయాల్లో ఇన్-ఛార్జ్ అధికారులతోనే పనులు నడుస్తుండటంతో భక్తుల సౌకర్యాల పర్యవేక్షణ కుంటుపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం…. కొత్తగా 190 పోస్టులను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
{{/usCountry}}రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా భక్తుల రద్దీ పెరగడం, ఆలయాల ఆదాయం వృద్ధి చెందడంతో పరిపాలనలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అనేక దేవాలయాల్లో ఇన్-ఛార్జ్ అధికారులతోనే పనులు నడుస్తుండటంతో భక్తుల సౌకర్యాల పర్యవేక్షణ కుంటుపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం…. కొత్తగా 190 పోస్టులను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
{{/usCountry}}ఈ పోస్టుల భర్తీ ద్వారా ప్రధాన దేవాలయాల్లో పూర్తిస్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. తద్వారా ఆలయ భూముల పరిరక్షణ, ఆదాయ వ్యయాల ఆడిటింగ్, పండుగల నిర్వహణ, భక్తులకు అందే సేవల్లో నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ లేదా నియామక ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.