తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రతి నెలా ఒక ఉద్యోగ ప్రకటనను జారీ చేయాలని యోచిస్తోంది. ఆర్థిక శాఖ ఆమోదించిన సుమారు 2,500 పోస్టుల కోసం అధికారులు ప్రకటనలు, పరీక్షల షెడ్యూళ్లను సిద్ధం చేస్తున్నారు. జాప్యాన్ని నివారించడం, అభ్యర్థులకు తగినంత సన్నద్ధత సమయం ఇవ్వడమే దీని ముఖ్య ఉద్దేశం.

పట్టణ ప్రణాళిక, వ్యవసాయం, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర శాఖలలోని పోస్టుల కోసం మరిన్ని ప్రకటనలు సిద్ధం చేస్తున్నారు. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, డీఐఈటీ లెక్చరర్లు, బీ.ఎడ్ లెక్చరర్లు, ఆర్టీసీ, సివిల్ సప్లైస్ శాఖలలోని పోస్టులకు కూడా నియామకాలు చేపట్టనున్నారు.
తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్ 2) పోస్టులను భర్తీ చేసేందుకు కమిషన్ ఇప్పటికే ఒక ప్రకటనను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 27న ప్రారంభమవుతుంది.
యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలతో క్లాష్ కాకుండా టీజీపీఎస్సీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అన్ని పరీక్షలు రాసేందుకు అభ్యర్థులకు అనుకూలంగా షెడ్యూల్ తయారు చేస్తున్నారు. నియామక ప్రక్రియను మెరుగుపరిచేందుకు టీజీపీఎస్సీ ఒక షెడ్యూల్‌పై పనిచేస్తోంది.
కొత్త ప్రకటనలకు దరఖాస్తు చేసుకునేందుకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్‌డేట్‌ను కమిషన్ తప్పనిసరి చేసింది పబ్లిక్ కమిషన్. దాదాపు 30 లక్షల మంది అభ్యర్థులకు ఓటీఆర్ ఉన్నా.. కేవలం 12 లక్షల మంది మాత్రమే అప్‌డేట్ చేసుకున్నారు. గడువు పొడిగించినప్పటికీ, సుమారు 6 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే తమ ప్రొఫైల్‌లను అప్‌డేట్ చేసుకున్నారు.
కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగాలు
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 20 ఖాళీలను భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ ప్రకారం.. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 27, 2026 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి మే 25, 2026 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్షను జూలై 2026లో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
{{/usCountry}}రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 20 ఖాళీలను భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ ప్రకారం.. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 27, 2026 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి మే 25, 2026 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్షను జూలై 2026లో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
{{/usCountry}}ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in) సందర్శించాలి. ఇప్పటికే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకున్న వారు తమ ఐడీతో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా దరఖాస్తు చేసే వారు మొదట ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సమాచారంలో ఏవైనా తప్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకున్న తర్వాతే ఫైనల్ సబ్మిషన్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.