TG ICET 2026 Seat Allotment :ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఐసెట్ 2026 చివరి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ తుది విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా 11,729 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద మొత్తం 38,462 ఎంబీఏ, ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి మొత్తం 23,988 సీట్లు (62 శాతం) భర్తీ అయినట్లు అధికారులు వెల్లడించారు.
ఎంబీఏ కోర్సులో అందుబాటులో ఉన్న 31,181 సీట్లకు గాను 20,889 సీట్లు భర్తీ కాగా, ఎంసీఏ కోర్సులో 7,281 సీట్లకు గాను 3,099 సీట్లు మాత్రమే నిండాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 14,474 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి.
రిపోర్టింగ్ తేదీలు…
టీజీ ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయడానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సీటు సాధించిన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోగా నిర్ణీత ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన అనంతరం ఈ నెల 25వ తేదీలోపు తమకు కేటాయించిన కళాశాలల్లో వ్యక్తిగతంగా హాజరై నివేదించాలి (రిపోర్ట్ చేయాలి). గడువులోగా ఫీజు చెల్లించని, కాలేజీలో రిపోర్ట్ చేయని విద్యార్థుల సీట్లు రద్దవుతాయని అధికారులు స్పష్టం చేశారు.
అలాట్‌మెంట్ డౌన్లోడ్ ఇలా….
- ముందుగా తెలంగాణ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్ https://tgicet.nic.in/default.aspx ను సందర్శించాలి.
- హోమ్ పేజీలో కనిపించే 'Candidate Login' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ ఐడీ (Login ID), హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number), పాస్‌వర్డ్, పుట్టిన తేదీ మరియు స్క్రీన్‌పై ఉన్న క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
- వివరాలు నమోదు చేసిన తర్వాత మీకు సీటు కేటాయింపు జరిగి ఉంటే, అలాట్‌మెంట్ ఆర్డర్ ప్రింట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ అలాట్‌మెంట్ కాపీని సేవ్ చేసుకోవచ్చు.
- కళాశాలల్లో ప్రవేశం పొందే సమయంలో ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ కాపీ, ఫీజు రసీదులు అత్యంత కీలకం.