TG ICET Counselling 2026 : టీజీ ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం - పూర్తి షెడ్యూల్ ఇదే!
TG ICET 2026 Final Phase Counselling : టీజీ ఐసెట్ 2026 చివరి విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. వెబ్ ఆప్షన్లను 18, 19వ తేదీల్లో ఎంచుకోవాలి. ఈనెల 22వ తేదీ లోపు సీట్ల కేటాయింపు పూర్తవుతుంది.
TG ICET 2026 Final Phase Counselling : రాష్ట్రంలోని ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఐసెట్ (TG ICET) 2026 చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి (ఆగస్టు 17) నుంచి ప్రారంభమైంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులకు, మంచి కళాశాలల్లో సీటు ఆశిస్తున్న అభ్యర్థులకు ప్రవేశాలు పొందేందుకు ఇదే చివరి అవకాశం.

షెడ్యూల్ ప్రకారం…. నేటి నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, ధృవపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. మొదటి విడతలో పాల్గొనని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని హెల్ప్ లైన్ సెంటర్లలో ధృవపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. https://tgicet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
టీజీ ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్ తేదీలు :
- ఆన్‌లైన్ వివరాల నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్: 17-08-2026
- ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్: 18-08-2026
- వెబ్ ఆప్షన్ల నమోదు (కోర్సు, కళాశాల ఎంపిక): 18-08-2026 నుండి 19-08-2026 వరకు
- వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్: 19-08-2026
- తాత్కాలిక సీట్ల కేటాయింపు (ప్రొవిజనల్ అల్లాట్‌మెంట్): 22-08-2026 లేదా అంతకంటే ముందు
- ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్: 22-08-2026 నుండి 24-08-2026 వరకు
- కేటాయించిన కళాశాలలో నేరుగా రిపోర్టింగ్ చేయడం: 22-08-2026 నుండి 25-08-2026 వరకు
మొదటి విడతలో సీటు వచ్చినా చేరని వారు, ప్రాధాన్యత కలిగిన కళాశాలలో సీటు పొందేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి అధికారులు సూచించారు. ఇచ్చిన గడువులోగా నమోదు చేసుకున్న ఆప్షన్ల ఆధారంగా ఆగస్టు 22 నాటికి సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన విద్యార్థులు నిర్దేశిత తేదీల్లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి, తమకు కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేసి అడ్మిషన్ ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

