TG Inter Exams 2026 : ఇకపై విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు హాల్ టికెట్ల వివరాలు - ఇవిగో తాజా అప్డేట్స్
తెలంగాణ ఇంటర్ పరీక్షల - 2026 నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లకు కూడా విద్యార్థుల హాల్ టికెట్లను పంపాలని నిర్ణయించింది.
తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలపై ఇంటర్ బోర్జు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది.తల్లిదండ్రుల వాట్సప్‌నకు విద్యార్థుల హాల్‌టికెట్లను పంపనున్నారు. హాల్‌టికెట్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామాతో పాటు ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందో తల్లిదండ్రులకు తెలియజెప్పడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫోన్లకు సందేశాలు…
ఎక్కువ శాతం తల్లిదండ్రుల వద్ద స్మార్ట్ ఫోన్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. అంతేకాకుండా సెకండ్ ఇయర్ హాల్ టికెట్లు ఫస్ట్ ఇయర్ మార్కుల లింక్ కూడా ఇస్తారు. ఫలితంగా సదరు విద్యార్థి ఫస్ట్ ఇయర్ లో తప్పిన(ఫెయిల్) పరీక్ష వివరాలు కూడా కనిపిస్తాయి. ఫలితంగా తల్లిదండ్రులకు కూడా ఓ అంచనా ఉండనుంది. ఈ నిర్ణయం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక ఫిబ్రవరి 2వ తేదీ నుంచి తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయి. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
టీజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026:
- 25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
- 27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1
- 02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
- 5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
- 9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1
- 12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్
- 17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1
టీజీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:
- 26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
- 28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2
- 04- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
- 6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
- 10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2
- 13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2
- 16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,
- 18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

