రాష్ట్రంలోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లాసెట్ - 2026 కు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తులు కొనసాగుతున్నాయి .ఇంటర్ విద్యార్హతతో 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు, డిగ్రీ విద్యార్హతపై మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ పూర్తయిన వారికి రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రస్తుతం లాసెట్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా… లేట్ ఫీజు లేకుండా అప్లయ్ చేసుకునే గడువు నేటితో(ఏప్రిల్ 1) ముగియనుంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ తేదీ దాటితే…. నిర్ణేశించిన ఫీజుతో పాటు ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
టీజీ లాసెట్ - 2026 అప్లికేషన్ సాధారణ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900, జనరల్ అభ్యర్థులు రూ. 1100 చెల్లించాలి. పీజీఎల్ సెట్ కు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ఖులు రూ. 900, జనరల్ అభ్యర్థులు రూ. 1100 చెల్లించాలి.
ఆలస్య రుసుంతో దరఖాస్తు తేదీలు…
రూ. 500 ఫైన్ తో ఏప్రిల్ 15 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రూ.1000 ఫైన్ తో ఏప్రిల్ 25, రూ. 2 వేల ఫైన్ తో మే 5 వరకు అవకాశం ఉంటుంది. ఇక రూ.4000 ఫైన్ మే 10, రూ. 10 వేల ఆలస్య రుసుంతో మే 13 వరకు ఛాన్స్ ఉంటుంది. ఇక అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ మే 3 నుంచి అందుబాటులోకి వస్తుంది. మే 12న హాల్ టికెట్లు విడుదలవుతాయి.
టీజీ లాసెట్ ఎగ్జామ్ ఎప్పుడంటే..?
మే 18వ తేదీన మూడేళ్ల ఎల్ఎల్ బీ ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. ఉదయం 09. 30 గంటల నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. ఇక ఎల్ఎల్ బీ ఐదేళ్ల కోర్సుతో పాటు ఎల్‌ఎల్‌ఎం ఎంట్రెన్స్ పరీక్షను సాయంత్రం 4 గంటల నుంచి 05.30 గంటల మధ్య నిర్వహిస్తారు.
{{/usCountry}}మే 18వ తేదీన మూడేళ్ల ఎల్ఎల్ బీ ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. ఉదయం 09. 30 గంటల నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. ఇక ఎల్ఎల్ బీ ఐదేళ్ల కోర్సుతో పాటు ఎల్‌ఎల్‌ఎం ఎంట్రెన్స్ పరీక్షను సాయంత్రం 4 గంటల నుంచి 05.30 గంటల మధ్య నిర్వహిస్తారు.
{{/usCountry}}టీజీ లాసెట్ ప్రాథమిక కీ మే 23వ తేదీన అందుబాటులోకి వస్తాయి. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మే 25వ తేదీ వరకు స్వీకరిస్తారు. జూన్ 5వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
టీజీ లాసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు. గత కొంతకాలంగా లా కోర్సులకు మంచి డిమాండ్ ఉంటోంది. సీట్ల కోసం చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.