తెలంగాణ లాసెట్ - 2026 రాసిన అభ్యర్థులకు అప్డేట్ వచ్చేసింది. నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ అయింది. మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB) మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కోర్సు అయిన ఎల్‌ఎల్‌ఎం (LLM) లలో ప్రవేశాలు పొందాలనుకునే వాళ్లు… రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు జూలై 10వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జూలై 10తోనే ఈ ఆన్‌లైన్ నమోదు(రిజిస్ట్రేషన్), ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ముగుస్తుందని అధికారులు స్పష్టం చేశారు. చివరి నిమిషంలో సర్వర్ ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులు ముందుగానే తమ దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని సూచించారు.
- జులై 5(ఇవాళ) నుంచి జూలై 10 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులు జులై 16 నుండి జులై 19 వరకు తమకు నచ్చిన కాలేజీలను వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంచుకోవచ్చు.
- వెబ్ ఆప్షన్ల ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు జులై 24వ తేదీన ఎల్‌ఎల్‌బీ సీట్లను కేటాయిస్తారు.
కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు తమ లాసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, విద్యార్హతల సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. https://lawcetadm.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఆధారంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత జూలై 16 నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి.
ఎల్‌ఎల్‌ఎం (పీజీఎల్‌సెట్) కౌన్సెలింగ్ వివరాలు:
ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ క్రింది విధంగా ఉంది…
{{/usCountry}}ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ క్రింది విధంగా ఉంది…
{{/usCountry}}ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ : జూలై 27 నుంచి జూలై 31 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవచ్చు.
వెబ్ ఆప్షన్ల నమోదు : రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 1 మరియు ఆగస్టు 2 తేదీల్లో తమకు నచ్చిన కాలేజీలను వెబ్ ఆప్షన్ల రూపంలో ఎంచుకోవాల్సి ఉంటుంది.
సీట్ల కేటాయింపు: అభ్యర్థుల మెరిట్ మార్కులు, రిజర్వేషన్లు మరియు వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఆగస్టు 5వ తేదీన ఎల్‌ఎల్‌ఎం మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తారు.