TG LAWCET 2026 Counselling : తెలంగాణలో లా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు మరో కొత్త అప్డేట్ వచ్చేసింది. ఎల్‌ఎల్‌బీ (3 YDC), ఎల్‌ఎల్‌బీ (5 YDC) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీ లాసెట్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల అప్‌లోడ్ గడువును మరోసారి పొడిగించారు.
ఈనెల 29 వరకు గడువు పొడిగింపు…

అర్హులైన అభ్యర్థులు జూలై 28 వరకు ఆన్‌లైన్ విధానంలో తమ వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు అవసరమైన ధృవీకరణ పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. గతంలో ఇచ్చిన గడువు జూలై 20వ తేదీతో ముగియడంతో... విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్వీనర్ కార్యాలయం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ అంతా కూడా ఈ పొడిగించిన గడువు లోపే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ ముఖ్య తేదీలు…
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల అప్‌లోడ్: జూలై 28 వరకు అవకాశం ఉంటుంది.
- అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన (సవరణల అవకాశం): జూలై 28
- మొదటి విడత వెబ్ ఆప్షన్ల నమోదు: జూలై 28 నుండి జూలై 31 వరకు
- వెబ్ ఆప్షన్ల ఎడిట్ అవకాశం: ఆగస్టు 1 , 2026
- మొదటి విడత సీట్ల కేటాయింపు (వెబ్‌సైట్‌లో): ఆగస్టు 5, 2026
- కళాశాలల్లో రిపోర్టింగ్: ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 వరకు
టీజీ లాసెట్ - 2026లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా సందేహాలు ఉంటే అధికారిక ఈ-మెయిల్ (tgcetsadmissions2026@gmail.com) ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
ఇక లాసెట్ కౌన్సెలింగ్లో పాల్గొనే అభ్యర్థులు తమ లాసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, విద్యార్హతల సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. https://lawcetadm.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఆధారంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
{{/usCountry}}ఇక లాసెట్ కౌన్సెలింగ్లో పాల్గొనే అభ్యర్థులు తమ లాసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, విద్యార్హతల సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. https://lawcetadm.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఆధారంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
{{/usCountry}}అభ్యర్థులు సాధించిన ర్యాంకులతో పాటు వారి రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందే వాళ్లు… నిర్దేశించిన తేదీలలోపే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. ఇక గడిచిన కొంతకాలంగా లా కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో ఈ సీట్లకు తెగ డిమాండ్ ఉంటోంది.