...
...
Next Story

TG LAWCET 2026 Counseling : తెలంగాణ లాసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - 15 నుంచి రిజిస్ట్రేషన్లు!

TG LAWCET 2026 Final Phase Counseling : టీజీ లాసెట్ - 2026 ఫైనల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ విడుదలైంది. సెప్టెంబర్ 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

Published on: Sep 14, 2026, 07:41:43 IST
Advertisement

TG LAWCET 2026 Final Phase Counseling : తెలంగాణలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీతో పాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీజీ లాసెట్, పీజీలాసెట్ 2026' చివరి విడత (ఫైనల్ ఫేజ్) వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటివరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనని అభ్యర్థులకు న్యాయ విద్యలో చేరేందుకు ఇది చివరి అవకాశమని అధికారులు తెలిపారు.

ఈనెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు - ముఖ్య తేదీలు

టీజీ లాసెట్ 2026 కౌన్సెలింగ్
టీజీ లాసెట్ 2026 కౌన్సెలింగ్

మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు సెప్టెంబర్ 15 నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెస్ ఫీజు చెల్లించి, ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

  • ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను సెప్టెంబర్ 18న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. సమాచారంలో ఏవైనా సవరణలు ఉంటే ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
  • అభ్యర్థులు సెప్టెంబర్ 19 నుంచి 21వ తేదీ వరకు కళాశాలల ప్రాధాన్యత ప్రకారం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 21న ఆప్షన్లను సవరించుకునే (ఎడిట్) వెసులుబాటు కల్పించారు.
  • ఎంపిక చేసిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా సెప్టెంబర్ 25న తాత్కాలికంగా సీట్లు సాధించిన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
  • సీటు పొందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు రశీదు, ఒరిజినల్ సర్టిఫికేట్లతో సంబంధిత కళాశాలల్లో సెప్టెంబర్ 29 నాటికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ - https://lawcetadm.tgche.ac.in/

గత విడతల్లో సీట్లు పొంది కళాశాలల్లో చేరని అభ్యర్థులకు… అలాగే ఫేజ్-1, ఫేజ్-2లలో పొందిన సీట్లను రద్దు చేసుకున్న విద్యార్థులకు ఈ ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అర్హత లేదని కన్వీనర్ స్పష్టం చేశారు

టీజీ లాసెట్ 2026 - ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ ఇలా :

  • అభ్యర్థులు మొదటగా తెలంగాణ లాసెట్ అధికారిక వెబ్‌సైట్‌ https://lawcet.tgche.ac.in/ ను సందర్శించాలి.
  • హోంపేజీలో కనిపించే 'Download Rank Card' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ లాసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత 'Submit' బటన్‌పై క్లిక్ చేస్తే మీ ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • భవిష్యత్తు అవసరాల కోసం అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డును ప్రింట్ అవుట్ తీసుకొని భద్రపరుచుకోవడం మంచిది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks