TG LAWCET Hall Ticket : తెలంగాణ లాసెట్ - 2026 హాల్ టికెట్లు విడుదల.... ఇలా డౌన్లోడ్ చేసుకోండి
TG LAWCET 2026 Hall Ticket : టీజీ లాసెట్, పీజీ ఎల్‌సెట్-2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TG LAWCET 2026 Hall Ticket : రాష్ట్రంలోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ లాసెట్, టీజీ పీజీ ఎల్‌సెట్ (TG PGLCET)-2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.

- మొదటి సెషన్ (3 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ): ఉదయం 9:30 నుండి 11:00 వరకు.
- రెండవ సెషన్ (3 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ): మధ్యాహ్నం 12:30 నుండి 2:00 వరకు.
- మూడవ సెషన్ (5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ మరియు పీజీ ఎల్‌సెట్): సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు.
టీజీ హాల్ టికెట్ 2026 డౌన్లోడ్ :
అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను పొందవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
- అధికారిక వెబ్‌సైట్ lawcet.tgche.ac.in ను సందర్శించండి.
- హోమ్ పేజీలో కనిపించే 'Download Hall Ticket' లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయండి.
- స్క్రీన్‌పై కనిపించే హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింటౌట్ తీసుకోవాలి.
హాల్ టికెట్‌పై అభ్యర్థి పేరు, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం చిరునామా వంటి వివరాలను సరిచూసుకోవాలి. పరీక్ష రోజున హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ మొదలైనవి) తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలి.
- టీజీ లాసెట్ ప్రాథమిక కీ మే 23వ తేదీన అందుబాటులోకి వస్తాయి. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మే 25వ తేదీ వరకు స్వీకరిస్తారు.
- జూన్ 5వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
- టీజీ లాసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.
- విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు.
- కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు.
- గత కొంతకాలంగా లా కోర్సులకు మంచి డిమాండ్ ఉంటోంది. సీట్ల కోసం చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ లాసెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

