TG LAWCET Counselling : టీజీ లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్ అప్డేట్ - రిజిస్ట్రేషన్లు ప్రారంభం, షెడ్యూల్ వివరాలు

TG LAWCET Phase 2 Counselling : టీజీ లాసెట్ రెండో విడత అడ్మిషన్ల వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. నేటి నుంచి రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. ఈ నెల 29న సీట్లను కేటాయిస్తారు.

Published on: Aug 19, 2026, 15:05:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG LAWCET Phase 2 Counselling : తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ లాసెట్ (TG LAWCET) అడ్మిషన్ల రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనని లేదా రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు ఇది ఒక చక్కని అవకాశం అని ప్రవేశాల కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు.

టీజీ లాసెట్ 2026 రెండో విడత కౌన్సెలింగ్
టీజీ లాసెట్ 2026 రెండో విడత కౌన్సెలింగ్

న్యాయవిద్య అభ్యసించాలనుకునే అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోగా తమ ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. మొదటి దశలో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుతో పాటు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించిన అనంతరం…. అర్హులైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. దరఖాస్తుల్లో లేదా వివరాల్లో ఏవైనా సవరణలు ఉంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. దీని ఆధారంగా వెబ్ ఆప్షన్లు ఎంచుకోవడానికి అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.

వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత, అభ్యర్థులు తాము ఎంచుకున్న ప్రాధాన్యతల ఆధారంగా ఆప్షన్లలో మార్పులు లేదా చేర్పులు (Edit) చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ మరియు వెబ్ ఆప్షన్ల ఆధారంగా కాలేజీల వారీగా తాత్కాలికంగా ఎంపికైన వారి జాబితాను రూపొందించి అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

సీటు పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో నేరుగా నివేదించాల్సి ఉంటుంది . ఈ సమయంలో విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ట్యూషన్ ఫీజు చెల్లించిన రశీదును తప్పనిసరిగా సంబంధిత కాలేజీ అధికారులకు సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీల వివరాలు:

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల అప్‌లోడ్ (మొదటి విడతలో నమోదు చేసుకోని వారికి) : ఆగస్టు 19 నుంచి ఆగస్టు 22 వరకు
  • పరిశీలించిన అర్హుల జాబితా ప్రదర్శన, సవరణలకు అవకాశం : ఆగస్టు 23
  • వెబ్ ఆప్షన్ల నమోదు: ఆగస్టు 23 నుంచి ఆగస్టు 25 వరకు
  • వెబ్ ఆప్షన్ల ఎడిట్ (సవరణ) అవకాశం : ఆగస్టు 26
  • కళాశాలల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన : ఆగస్టు 29
  • సంబంధిత కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజు రశీదుతో రిపోర్టింగ్ : ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5 వరకు

లా కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు గడువు తేదీలను గమనించి, ఆన్‌లైన్ ప్రక్రియను మరియు కాలేజ్ రిపోర్టింగ్‌ను సకాలంలో పూర్తి చేసుకోవాలని అడ్మిషన్ల కన్వీనర్ స్పష్టం చేశారు. https://lawcetadm.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అర్హులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More