తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్!
తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదలైంది. జాబితాపైనా అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే తెలిపేందుకు మరోసారి అవకాసం బోర్డు కల్పించింది.
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీ ప్రక్రియలో మరో కీలక దశ పూర్తయింది. ఈ పోస్టులకు సంబంధించిన ‘ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్’ను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(MHSRB) విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) రాసిన మొత్తం 40,423 మంది అభ్యర్థుల వివరాలను, వారు సాధించిన మార్కులతో సహా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు బోర్డు ప్రతి దశలోనూ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. సీబీటీ, కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ సర్వీసు వెయిటేజీ మార్కులపై ఆగస్టులోనే ఒక దఫా అభ్యంతరాలను స్వీకరించి, అభ్యర్థుల సందేహాలను బోర్డు నివృత్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాపైనా అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే తెలిపేందుకు మరోసారి ఛాన్స్ కల్పించింది.
అభ్యర్థులు డిసెంబర్ 24 నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బోర్డు వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ అభ్యంతరాలను నమోదు చేయవచ్చు. అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేస్తామని, ఆ తర్వాత మెరిట్ ఆధారంగా 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తామని బోర్డు స్పష్టం చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం, ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను విడుదల చేయనున్నారు.
ఇటీవలే 1260 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల నియామక ప్రక్రియను బోర్డు పూర్తి చేసింది. ఈ 1260 మంది ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు, ఉద్యోగాలు ఎంపికయ్యే 2322 మంది నర్సింగ్ ఆఫీసర్లు కూడా జనవరిలోనే ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గతేడాది 7 వేలకుపైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మరో 2322 పోస్టులను భర్తీ చేస్తోంది దీంతో ప్రభుత్వ హాస్పిటళ్లలో నర్సుల కొరత పూర్తిగా తీరిపోతుందని, అవసరానికి సరిపడా సిబ్బంది అందుబాటులో ఉంటారని అంటున్నారు.
ఆరోగ్యశాఖలో గడిచిన రెండేళ్లలోనే 11 వేలకుపైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో 9 వేలకుపైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 600లకుపైగా డాక్టర్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి. మరో 5 వేలకుపైగా పోస్టులు భర్తీ ప్రక్రియలో ఉన్నాయి. ఇందులో 1600లకుపైగా స్పెషలిస్ట్ డాక్టర్(సీఏఎస్ స్పెషలిస్ట్) పోస్టులు, 600లకుపైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 700లకుపైగా ఫార్మసిస్ట్ పోస్టులు, సుమారు 2 వేల వరకూ మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


