TG PGECET 2026 Seat Allotment : రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో పీజీ (ఎంటెక్/ఎంఫార్మసీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పీజీఈసెట్ (TG PGECET 2026) కౌన్సెలింగ్ కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. తొలి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి.

టీజీ పీజీఈసెట్ మొదటి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో మొత్తం 7,750 మంది అభ్యర్థులు తమ ప్రాధాన్యత కళాశాలలు, కోర్సులను ఎంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కన్వీనర్ కోటా కింద మొత్తం 5,338 ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ సీట్లు అందుబాటులో ఉండగా….. అందులో 4,221 సీట్లను కేటాయించినట్లు కన్వీనర్ ప్రకటించారు. మిగిలిన ఖాళీ సీట్లను తదుపరి విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు.
రిపోర్టింగ్‌కు జులై 30 వరకు గడువు
తొలి విడతలో సీటు సాధించిన విద్యార్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ముందుగా సంబంధిత సీటు అలాట్ మెంట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకొని, ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి.
జులై 30వ తేదీ లోగా కేటాయించిన కళాశాలలో నేరుగా హాజరై తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా కాలేజీలో రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీటు కేటాయింపు రద్దవుతుంది. ఈ ఖాళీలను మలి విడత కౌన్సెలింగ్‌లో చేర్చి… భర్తీ చేస్తారు.
TG PGECET 2026 సీటు కేటాయింపు - అలాట్‌మెంట్ డౌన్లోడ్ ఇలా :
- ముందుగా పీజీఈసెట్ అడ్మిషన్ల అధికారిక వెబ్‌సైట్ pgecetadm.tgche.ac.in ను సందర్శించాలి.
- హోం పేజీలో కనిపిస్తున్న 'Candidate Allotment Login' లింక్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ మీ పీజీఈసెట్ హాల్ టికెట్ నంబర్, సాధించిన ర్యాంక్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత 'Submit' బటన్‌పై క్లిక్ చేయాలి.
- మీ స్క్రీన్‌పై అలాట్‌మెంట్ ఆర్డర్ డిస్ ప్లే అవుతుంది.
- అడ్మిషన్ ప్రాసెస్ లో అలాట్ మెంట్ కాపీ కీలకం. కాబట్టి భవిష్యత్తు అవసరాల కోసం దానిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్‌అవుట్ తీసి ఉంచుకోవాలి.