జూన్ 2 నుండి సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 అభ్యర్థుల కోసం వారం రోజుల పాటు ఉచిత కార్యక్రమం

సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పరీక్షలపై ఉచిత కార్యక్రమం ఉంది.

Published on: May 30, 2026, 05:39:49 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక 'డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ' (Dr. MCR HRD) ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. సంస్థ గోల్డెన్ జూబ్లీ (స్వర్ణోత్సవ) వేడుకల సందర్భంగా అభ్యర్థుల కోసం వారం రోజుల పాటు ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని పూర్తిగా ఉచితంగా నిర్వహించనుంది.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ

ఈ శిక్షణా కార్యక్రమం 2026, జూన్ 2 నుండి ప్రారంభం కానుంది. ప్రతిరోజూ మూడు గంటల పాటు ఈ క్లాసులు సాగుతాయి.

ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ మెంబర్లు, సీనియర్ బ్యూరోక్రాట్లు అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఒక ప్రెస్ నోట్ ద్వారా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఇందులో క్రింది అంశాలపై ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి:

  • పరీక్షా వ్యూహాలు : ప్రిలిమ్స్, రియు మెయిన్స్ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో వివరిస్తారు.
  • వ్యక్తిత్వ వికాసం : అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే పాఠాలు.
  • కమ్యూనికేషన్ స్కిల్స్: భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడం.
  • ఎథిక్స్, లీడర్‌షిప్: నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలపై అవగాహన.ఇంటర్వ్యూ గైడెన్స్: సివిల్స్, గ్రూప్-1 ఇంటర్వ్యూలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక చిట్కాలు.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అనేది సాధారణంగా ఐఏఎస్, ఐపీఎస్, ఇతర రాష్ట్ర స్థాయి గ్రూప్-1 అధికారులకు శిక్షణ ఇచ్చే అత్యున్నత ప్రభుత్వ సంస్థ. ఇటువంటి లీడింగ్ ఇన్స్టిట్యూట్‌లో, అనుభవజ్ఞులైన అధికారుల సమక్షంలో గైడెన్స్ లభించడం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభ్యర్థులకు పరీక్షల పట్ల ఉన్న భయాందోళనలు తొలగిపోతాయి. ఎలాంటి కోచింగ్ ఫీజులు చెల్లించలేని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది ఒక వరమని చెప్పవచ్చు.

ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండిలా

ఉచిత శిక్షణా కార్యక్రమం ప్రాథమికంగా సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం రూపొందించబడింది. ఆసక్తి గల అభ్యర్థులు తమ కరికులమ్ విటే(CV) లేదా బయో-డేటాను 'సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్' మెయిల్ ఐడీకి పంపి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడీ: ctsmcrhrdit24@gmail.com

పరిమిత సీట్లు ఉండే అవకాశం ఉన్నందున అభ్యర్థులు వెంటనే తమ వివరాలను పంపి ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More