TG PGECET 2026 Counselling : టీజీ పీజీఈసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు - అలాట్‌మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే

TG PGECET 2026 Seat Allotment : తెలంగాణ పీజీఈసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. 4,221 మందికి సీట్లు దక్కాయి. జులై 30 నాటికి కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 

Published on: Jul 27, 2026, 07:45:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG PGECET 2026 Seat Allotment : రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో పీజీ (ఎంటెక్/ఎంఫార్మసీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పీజీఈసెట్ (TG PGECET 2026) కౌన్సెలింగ్ కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. తొలి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి.

టీజీ పీజీఈసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు
టీజీ పీజీఈసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు

టీజీ పీజీఈసెట్ మొదటి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో మొత్తం 7,750 మంది అభ్యర్థులు తమ ప్రాధాన్యత కళాశాలలు, కోర్సులను ఎంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కన్వీనర్ కోటా కింద మొత్తం 5,338 ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ సీట్లు అందుబాటులో ఉండగా….. అందులో 4,221 సీట్లను కేటాయించినట్లు కన్వీనర్ ప్రకటించారు. మిగిలిన ఖాళీ సీట్లను తదుపరి విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు.

రిపోర్టింగ్‌కు జులై 30 వరకు గడువు

తొలి విడతలో సీటు సాధించిన విద్యార్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ముందుగా సంబంధిత సీటు అలాట్ మెంట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకొని, ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి.

జులై 30వ తేదీ లోగా కేటాయించిన కళాశాలలో నేరుగా హాజరై తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా కాలేజీలో రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీటు కేటాయింపు రద్దవుతుంది. ఈ ఖాళీలను మలి విడత కౌన్సెలింగ్‌లో చేర్చి… భర్తీ చేస్తారు.

TG PGECET 2026 సీటు కేటాయింపు - అలాట్‌మెంట్ డౌన్లోడ్ ఇలా :

  • ముందుగా పీజీఈసెట్ అడ్మిషన్ల అధికారిక వెబ్‌సైట్ pgecetadm.tgche.ac.in ను సందర్శించాలి.
  • హోం పేజీలో కనిపిస్తున్న 'Candidate Allotment Login' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అక్కడ మీ పీజీఈసెట్ హాల్ టికెట్ నంబర్, సాధించిన ర్యాంక్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత 'Submit' బటన్‌పై క్లిక్ చేయాలి.
  • మీ స్క్రీన్‌పై అలాట్‌మెంట్ ఆర్డర్ డిస్ ప్లే అవుతుంది.
  • అడ్మిషన్ ప్రాసెస్ లో అలాట్ మెంట్ కాపీ కీలకం. కాబట్టి భవిష్యత్తు అవసరాల కోసం దానిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్‌అవుట్ తీసి ఉంచుకోవాలి.

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి అలాట్ మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More