TG POLYCET 2026 Counselling : టీజీ పాలిసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - రిపోర్టింగ్ గడువు పొడిగింపు..!
TG POLYCET 1st Phase Counselling 2026 : టీజీ పాలిసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. విద్యార్థులు రిపోర్టింగ్ చేసే గడువును అధికారులు పొడిగించారు.
TG POLYCET 1st Phase Counselling 2026 : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీజీ పాలిసెట్-2026' (TG POLYCET) మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి విద్యార్థులకు సాంకేతిక విద్యాశాఖ ముఖ్యమైన సమాచారం అందించింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా వివిధ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు పొందిన అభ్యర్థుల ఆన్‌లైన్ రిపోర్టింగ్ , ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.

ఈనెల 11 వరకు పొడిగింపు
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో సీట్లు పొందిన అర్హులైన విద్యార్థులు ఈ నెల 11వ తేదీ (జూన్ 11) వరకు తమ ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించడంతో పాటు సంబంధిత వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించి… ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయని అభ్యర్థుల సీట్లు ఆటోమేటిక్‌గా రద్దవుతాయి. ఆ ఖాళీలను తదుపరి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల విద్యార్థులు ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకుని తమ సీట్లను ఖరారు చేసుకోవాలని సూచిస్తున్నారు.
టీజీ పాలిసెట్ సీట్లు - అలాట్ మెంట్ డౌన్లోడ్ ఇలా:
- ముందుగా https://tgpolycet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని క్యాండెట్ లాగిన్ పై క్లిక్ చేయాలి.
- మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత… అలాట్ మెంట్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.
- దీనిపై క్లిక్ చేస్తే మీ అలాట్ మెంట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఈ కాపీని పొందొచ్చు.
- కాలేజీలో రిపోర్టింగ్ చేయాలంటే అలాట్ మెంట్ అర్డర్ కాపీని తప్పనిసరిగా ఉండాలి.
టీజీ పాలిసెట్ మొదటి విడత సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిపోయిన సీట్ల కోసం చివరి విడత (ఫైనల్ ఫేజ్) కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 15న ప్రారంభమై… జూన్ 22వ తేదీతో ముగుస్తుంది.
కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా విద్యార్థులకు తమ బ్రాంచ్‌లను మార్చుకునేందుకు అధికారులు ఇంటర్నల్ స్లైడింగ్ అవకాశం కల్పించారు. జూన్ 27 నుంచి జూన్ 30 వరకు ఈ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు తాము చేరిన కళాశాలలోనే ఒక కోర్సు నుంచి మరో కోర్సులోకి (ఉదాహరణకు మెకానికల్ బ్రాంచ్ నుంచి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కు) మారడానికి వీలుంటుంది.
ఇక ఈ ప్రధాన ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత కూడా ఏవైనా సీట్లు మిగిలిపోతే…. వాటిని భర్తీ చేయడానికి జూలై 1 నుంచి జూలై 8వ తేదీల మధ్య స్పాట్ ప్రవేశాలు ) నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

