తెలంగాణ సెట్ ఎగ్జామ్ - 2025పై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేశారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… డిసెంబర్ 10 నుంచి 12 తేదీ వరకు సెట్ పరీక్షలు జరగాల్సి ఉంది.
త్వరలోనే కొత్త తేదీలు

రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సెట్ పరీక్షలను వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ఈ ఏడాది టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది.
టీజీ సెట్ -2025ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులతో నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో మూడు గంటల పాటు పరీక్ష నిర్వహించనున్నారు.
ఆబ్జెక్టివ్ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.
ఈ పేపర్లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.
{{/usCountry}}ఈ పేపర్లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.
{{/usCountry}}ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ,నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలుంటాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే డిసెంబర్ 3వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రావాలి. కానీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో… హాల్ టికెట్ల విడుదలపై కూడా కొత్త తేదీని ప్రకటిస్తారు. టీఎస్ సెట్ నోటిఫికేషన్‌తో పాటు ముఖ్యమైన అప్డేట్స్ కోసం http://telanganaset.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు.