తెలంగాణ సెట్ - 2025 పరీక్ష తేదీలపై మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే పరీక్షలు పూర్తి అయిన నేపథ్యంలో… వాటికి సంబంధించిన ప్రాథమిక కీలతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లు అందుబాటులోకి వచ్చాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు.. ప్రిలిమినరీ కీలను చూసుకోవచ్చు.
టీజీ సెట్ ప్రిలిమినరీ కీ - ఇలా చెక్ చేసుకోండి
- టీజీ సెట్ - 2025 అభ్యర్థులు http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలోని మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మొత్తం 20 సబ్జెక్టుల పేపర్లు కనిపిస్తాయి. వాటి పక్కనే డౌన్లోడ్ లింక్ ఉంటుంది.
- డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేస్తే మీకు ప్రిలిమినరీ కీ ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా పీడీఎఫ్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
త్వరలో ఫలితాలు…!

గతేడాది డిసెంబర్ నెలలోని 22, 23, 24 తేదీల్లో టీజీ సెట్ - 2025 ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ ఏడాది టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
ఇప్పటికే పరీక్షలు పూర్తి కాగా… ప్రాథమిక కీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే టీజీ సెట్ ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. టీఎస్ సెట్ ఫలితాలతో పాటు ఇతర అప్డేట్స్ కోసం http://telanganaset.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు
ఈ టీజీ సెట్ -2025ను రెండు పేపర్లలో నిర్వహించారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులంటాయి. వీటిలో అభ్యర్థులు సాధించే మెరిట్ మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారు. ఓపెన్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా కటాఫ్ స్కోర్ ను నిర్ణయించి.. అర్హత సాధించిన వారికి మాత్రమే సెట్ పత్రాలను అందజేస్తారు.