...
...
Next Story

TG SET Results : తెలంగాణ సెట్ ఫలితాలు విడుదల - మీ స్కోర్ కార్డు ఇలా చెక్ చేసుకోండి

TG SET Results 2025 : టీజీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు https://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

Published on: Mar 20, 2026 07:11 PM IST
Advertisement

తెలంగాణ సెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయ్. గతేడాది నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 2565 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఈ మేరకు అధికారులు ఫలితాలను విడుదల చేశారు. కేటగిరీల వారీగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పేర్కొన్నారు.

టీజీ సెట్ రిజల్ట్స్ - ఇలా చెక్ చేసుకోండి

  1. టీజీ సెట్ - 2025 అభ్యర్థులు http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలోని రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా స్కోర్ కార్డు కాపీని పొందొచ్చు.

తెలంగాణ సెట్ ఫలితాలు
తెలంగాణ సెట్ ఫలితాలు

గతేడాది డిసెంబర్ నెలలోని 22, 23, 24 తేదీల్లో టీజీ సెట్ - 2025 ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీనే ఈ పరీక్షను నిర్వహించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్షల నిర్వహణ తర్వాత… ప్రాథమిక కీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిపై అభ్యంతరాలను స్వీకరించారు. దాదాపు రెండు నెలల తర్వాత… ఈ ఫలితాలను ప్రకటించారు.

ఈ టీజీ సెట్ -2025ను రెండు పేపర్లలో నిర్వహించారు. పేప‌ర్-1లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు, పేప‌ర్-2లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులంటాయి. వీటిలో అభ్యర్థులు సాధించే మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. ఓపెన్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా కటాఫ్ స్కోర్ ను నిర్ణయించి.. అర్హత సాధించిన వారికి మాత్రమే సెట్ పత్రాలను అందజేస్తారు.

టీజీ సెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని సెట్ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe