TG Social Welfare JCCET Results 2026 : తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అప్డేట్ వచ్చేసింది. ఇందుకు సంబంధించిన ఎంట్రెన్స్ ఫలితాలను (జేసీసెట్) రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విడుదల చేశారు. ఈ ఫలితాల ఆధారంగా ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గానూ మొదటి విడతలో (First Phase) మొత్తం 18,401 మంది విద్యార్థులు సీట్లు సాధించి ఎంపికయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 229 సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎంపీసీ (MPC), బైపీసీ (BiPC), ఎంఈసీ (MEC), సీఈసీ (CEC), హెచ్ఈసీ (HEC) గ్రూపులతో పాటు వివిధ ఒకేషనల్ కోర్సుల్లో కలిపి మొత్తం 19,740 ఇంటర్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి భారీ స్థాయిలోనే దరఖాస్తులు వచ్చాయి.
ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 45,357 దరఖాస్తులు రాగా.. ఈ నెల 15న నిర్వహించిన జేసీ సెట్ ప్రవేశ పరీక్షకు 39,052 మంది విద్యార్థులు హాజరయ్యారు. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా అధికారులు మొదటి విడత ఎంపిక జాబితాను సిద్ధం చేశారు.
రిపోర్టింగ్ తేదీలివే
మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించి ఎంపికైన విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సకాలంలో రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల విద్యా సంస్థలపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అపారమైన నమ్మకం ఉందని కొనియాడారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మరింత బాధ్యతాయుతంగా గురుకులాలను నిర్వహించాలని, విద్యా ప్రమాణాలను పెంచాలని అధికారులను ఆదేశించారు.
గురుకుల విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడదని మంత్రి తేల్చి చెప్పారు. గతంలో కొన్ని గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ (ఆహారం వికటించడం) వంటి దురదృష్టకర ఘటనలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని గుర్తుచేశారు. అలాంటి ఘటనలకు బాధ్యులైన వారిపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
{{/usCountry}}గురుకుల విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడదని మంత్రి తేల్చి చెప్పారు. గతంలో కొన్ని గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ (ఆహారం వికటించడం) వంటి దురదృష్టకర ఘటనలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని గుర్తుచేశారు. అలాంటి ఘటనలకు బాధ్యులైన వారిపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
{{/usCountry}}