తెలంగాణ పదో తరగతి పరీక్షలపై మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లింపుల గడువు పూర్తి కాగా… అధికారులు మరో అవకాశం కల్పించారు. తత్కాల్ పథకం కింద రూ.1000 ఆలస్య రుసుంతో ఈ నెల 21 నుంచి ఫీజు చెల్లించుకోవచ్చని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ గడువు జనవరి 27వ తేదీతో ముగియనుంది. ఇక జనవరి 29వ తేదీలోపు విద్యార్థుల సమాచారాన్ని ఆయా హెడ్ మాస్టర్లు… డీఈవోలకు సమర్పించాల్సి ఉంటుంది.

ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో మరోసారి…. పరీక్ష రుసుము చెల్లించడానికి గడువు తేదీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగింపు ఉండదు. విద్యార్థులు https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో వివరాలను తెలుసుకోవచ్చు.
టెన్త్ పరీక్షల షెడ్యూల్ 2026 :
మరోవైపు కొద్దిరోజుల కిందటే తెలంగాణ పదో తరగతి పరీక్ష టైమ్ టేబుల్ 2026 విడుదలైంది. మార్చి 2026లో ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. 2026 మార్చి 14 శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీన ముగుస్తాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఫిజిక్స్, బయోలజీ ఎగ్జామ్స్ సమయంలో మాత్రం మార్పులు ఉంటాయి.
- 14-03-2026, శనివారం, ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-I, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-II
- 18-03-2026, బుధవారం, సెకండ్ లాంగ్వేజ్
- 23-03-2026, సోమవారం, థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
- 28-03-2026, శనివారం, మ్యాథమెటిక్స్
- 02-04-2026, గురువారం, సైన్స్ పార్ట్-I(ఫిజికల్ సైన్స్)
- 07-04-2026, మంగళవారం, సైన్స్ పార్ట్-II(బయోలాజికల్ సైన్స్)
- 13-04-2026, సోమవారం, సోషల్ స్టడీస్
- 15-04-2026, బుధవారం, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I(సంస్కృతం, అరబిక్), ఎస్ఎస్‌సీ వొకేషనల్ కోర్స్(థియరీ)
- 16-04-2026, గురువారం, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II(సంస్కృతం, అరబిక్)
అన్ని సాధారణ అకడమిక్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. అయితే ఆబ్జెక్టివ్ టైప్(పార్ట్ బీ) ప్రశ్నలకు చివరి 30 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఉంటాయి. చివరి 15 నిమిషాల్లోనే సమాధానాలు పార్ట్ బీ రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}అన్ని సాధారణ అకడమిక్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. అయితే ఆబ్జెక్టివ్ టైప్(పార్ట్ బీ) ప్రశ్నలకు చివరి 30 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఉంటాయి. చివరి 15 నిమిషాల్లోనే సమాధానాలు పార్ట్ బీ రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}