అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలంగాణకు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని శ్రీజ రెడ్డి కోయ అదృశ్యమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. మసాచుసెట్స్ బోస్టన్ యూనివర్సిటీలో (UMass Boston) చదువుకుంటున్న ఆమె నవంబర్ 2వ తేదీ నుంచి కనిపించకుండా పోవడంతో బోస్టన్ పోలీసులు మిస్సింగ్ పర్సన్ అలర్ట్ జారీ చేశారు.

ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. విద్యార్థిని జాడ కనిపెట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, బోస్టన్ పోలీసులను అభ్యర్థించారు.
అదృశ్యమైన శ్రీజ రెడ్డి కోయ తెలంగాణలోని నల్గొండ జిల్లా కంగల్ మండలానికి చెందిన శాబ్దుల్లాపురం నివాసితులు కొయ యాదగిరి రెడ్డి, రూపా దంపతుల కుమార్తె. ఉన్నత విద్య అభ్యసించేందుకు శ్రీజ రెడ్డి దాదాపు ఏడాదిన్నర క్రితం అమెరికా వెళ్లి బోస్టన్‌లో నివాసముంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తోంది.
నవంబర్ 2న రాత్రి 9:45 గంటల ప్రాంతంలో బోస్టన్లోని డోర్చెస్టర్లోని ఎడిసన్ గ్రీన్ సమీపంలో ఉన్న తన గది నుండి బయటకు వాకింగ్ కోసం వెళ్లింది. ఆ తర్వాత శ్రీజ తిరిగి రాలేదు. బయటకు వెళ్లే సమయంలో ఆమె నల్లటి జాకెట్, బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించి ఉంది. ఆమె కార్సన్ బీచ్ (Carson Beach) లేదా హార్బర్ పాయింట్ ప్రాంతాలకు వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
గది నుంచి వెళ్లిన కొంతసేపటికే శ్రీజ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆమె చివరిగా ఉన్న లొకేషన్ రూమ్‌కు అర కిలోమీటరు దూరంలోనే చూపిస్తోందని ఆమె తండ్రి యాదగిరి రెడ్డి తెలిపారు. శ్రీజ రెడ్డి అదృశ్యంపై నవంబర్ 5న అధికారిక ప్రకటన విడుదల చేసిన బోస్టన్ పోలీసులు, ఆమెను సురక్షితంగా కనిపెట్టేందుకు ప్రజల సహాయాన్ని కోరారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలు, ఫోటోలు లేదా వీడియోలను అత్యంత రహస్యంగా ఉంచుతామని, వారి వివరాలను బయటకు వెల్లడించబోమని బోస్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది.
ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థిని సురక్షితంగా నివాసానికి చేరుకునేలా చూడాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బోస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్‌ను కోరారు.
{{/usCountry}}ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థిని సురక్షితంగా నివాసానికి చేరుకునేలా చూడాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బోస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్‌ను కోరారు.
{{/usCountry}}