AP Caste Certificate Download : వాట్సాప్‌లోనే కుల ధృవీకరణ పత్రం - మీ మొబైల్ ఫోన్ ద్వారానే ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు

AP Mana Mitra WhatsApp Governance : ఆంధ్రప్రదేశ్‌లో కుల ధృవీకరణ పత్రాల జారీ సేవలు ఇప్పుడు వాట్సాప్‌లోనే అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీజీఎస్ ద్వారా 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ వేదికగా కేవలం రూ.40 రుసుముతో క్యాస్ట్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Published on: Oct 8, 2026, 15:49:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

AP Mana Mitra WhatsApp Governance : ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవా కేంద్రాల చుట్టూ తిరిగే పనిలేకుండా పౌరులకు సేవలను అత్యంత సులభంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులు తమ కుల ధృవీకరణ పత్రాలను నేరుగా మొబైల్ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పించారు.

మనమిత్ర ద్వారా కుల ధ్రువీకరణపత్రం
మనమిత్ర ద్వారా కుల ధ్రువీకరణపత్రం

ఈ సరికొత్త సదుపాయం ద్వారా పౌరులు తమకు అవసరమైనప్పుడు, తాము ఉన్న చోటు నుంచే అత్యంత సులభంగా కుల ధృవీకరణ పత్రాలను పొందవచ్చని ఆర్టీజీఎస్ అధికారులు ప్రకటనలో తెలిపారు. ప్రతి చిన్న పనికి లేదా కుల ధృవీకరణ పత్రం ప్రతి (కాపీ) కోసం రెవెన్యూ కార్యాలయాలు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదు.

ఎవరికి ఈ సదుపాయం వర్తిస్తుంది….?

ప్రస్తుతానికి ఇప్పటికే కుల ధృవీకరణ పత్రాలు పొందిన వారికి 'రీ ఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్' కింద ఈ అవకాశం కల్పిస్తున్నారు. అనగా గతంలో సర్టిఫికెట్ పొందిన వారు తమకు కావలసిన సమయంలో వాట్సాప్ ద్వారానే దానిని మళ్లీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా…. త్వరలోనే మనమిత్ర ద్వారానే కొత్తగా కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు వెల్లడించారు.

వాట్సాప్‌లో కుల ధృవీకరణ పత్రం డౌన్లోడ్ ఎలా..?

  • మీ మొబైల్ నుంచి 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ నంబరు 9552300009 కు 'Hi' అని మెసేజ్ పంపాలి.
  • చాట్‌లో కనిపించే ఆప్షన్లలో 'సేవను ఎంచుకోండి' అనే విభాగాన్ని ఎంపిక చేసుకోవాలి.
  • అందులో 'రెవెన్యూ సేవలు' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత 'రీ-ఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • మీ 12 అంకెల ఆధార్ నంబరును టైప్ చేసి పంపాలి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని అక్కడ నమోదు చేయాలి.
  • స్క్రీన్‌పై కనిపించే ఆధార్ డెమోగ్రాఫిక్స్ రివ్యూలో అడిగిన వివరాలను సరిచూసుకుని నింపాలి.
  • కుల ధృవీకరణ పత్రం పొందడానికి నిర్ణయించిన రూ.40ల రుసుమును చెల్లించాలి.
  • అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా ఈ చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలి.
  • చెల్లింపు పూర్తయిన వెంటనే మీ కుల ధృవీకరణ పత్రం పీడీఎఫ్ (PDF) రూపంలో వాట్సాప్ చాట్ లోనే వస్తుంది.
  • ఆ పీడీఎఫ్‌ను మీరు ఫోన్‌లో సేవ్ చేసుకోవచ్చు లేదా నేరుగా ప్రింట్ తీసుకోవచ్చు.

ప్రభుత్వ సేవలను సాంకేతికత ద్వారా ప్రజల ముంగిటకే తెచ్చే దిశగా ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఇది ఎంతో సమయం ఆదా చేస్తుందని స్పష్టం చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More