అమెరికాలో తెలంగాణ విద్యార్థిని మిస్సింగ్.. విదేశీ వ్యవహారాల శాఖకు మంత్రి కోమటిరెడ్డి రిక్వెస్ట్!

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన నల్గొండ జిల్లాకు చెందిన కోయ శ్రీజా రెడ్డి అమెరికాలోని బోస్టన్‌లో కనిపించకుండా పోయింది. ఆమె జాడ కనిపెట్టాలని మంత్రి కోమటిరెడ్డి విదేశాంగ శాఖను, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని కోరారు.

Published on: Nov 7, 2026, 13:20:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలంగాణకు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని శ్రీజ రెడ్డి కోయ అదృశ్యమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. మసాచుసెట్స్ బోస్టన్ యూనివర్సిటీలో (UMass Boston) చదువుకుంటున్న ఆమె నవంబర్ 2వ తేదీ నుంచి కనిపించకుండా పోవడంతో బోస్టన్ పోలీసులు మిస్సింగ్ పర్సన్ అలర్ట్ జారీ చేశారు.

కోయ శ్రీజా రెడ్డి
కోయ శ్రీజా రెడ్డి

ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. విద్యార్థిని జాడ కనిపెట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, బోస్టన్ పోలీసులను అభ్యర్థించారు.

అదృశ్యమైన శ్రీజ రెడ్డి కోయ తెలంగాణలోని నల్గొండ జిల్లా కంగల్ మండలానికి చెందిన శాబ్దుల్లాపురం నివాసితులు కొయ యాదగిరి రెడ్డి, రూపా దంపతుల కుమార్తె. ఉన్నత విద్య అభ్యసించేందుకు శ్రీజ రెడ్డి దాదాపు ఏడాదిన్నర క్రితం అమెరికా వెళ్లి బోస్టన్‌లో నివాసముంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తోంది.

నవంబర్ 2న రాత్రి 9:45 గంటల ప్రాంతంలో బోస్టన్‌లోని డోర్‌చెస్టర్‌లోని ఎడిసన్ గ్రీన్ సమీపంలో ఉన్న తన గది నుండి బయటకు వాకింగ్ కోసం వెళ్లింది. ఆ తర్వాత శ్రీజ తిరిగి రాలేదు. బయటకు వెళ్లే సమయంలో ఆమె నల్లటి జాకెట్, బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించి ఉంది. ఆమె కార్సన్ బీచ్ (Carson Beach) లేదా హార్బర్ పాయింట్ ప్రాంతాలకు వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

గది నుంచి వెళ్లిన కొంతసేపటికే శ్రీజ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆమె చివరిగా ఉన్న లొకేషన్ రూమ్‌కు అర కిలోమీటరు దూరంలోనే చూపిస్తోందని ఆమె తండ్రి యాదగిరి రెడ్డి తెలిపారు. శ్రీజ రెడ్డి అదృశ్యంపై నవంబర్ 5న అధికారిక ప్రకటన విడుదల చేసిన బోస్టన్ పోలీసులు, ఆమెను సురక్షితంగా కనిపెట్టేందుకు ప్రజల సహాయాన్ని కోరారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలు, ఫోటోలు లేదా వీడియోలను అత్యంత రహస్యంగా ఉంచుతామని, వారి వివరాలను బయటకు వెల్లడించబోమని బోస్టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.

ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థిని సురక్షితంగా నివాసానికి చేరుకునేలా చూడాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బోస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్‌ను కోరారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More