...
...
Next Story

తెలంగాణ టెట్ - 2026 : దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ - ఇదిగో డైరెక్ట్ లింక్

టీజీ టెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇందుకు సంబంధించిన గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Published on: Nov 29, 2025 11:49 AM IST
Advertisement

తెలంగాణ టెట్ - 2026(జనవరి సెషన్) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు ఇవాళ అర్ధరాత్రిలోపు(నవంబర్ 29,2025) దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు పొడిగించే అవకాశం లేదు కాబట్టి… అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

టీజీ టెట్ - 2026 అప్లికేషన్ ప్రాసెస్…

  1. అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ముందుగా నిర్ణయించిన ఫీజును చెల్లించుకోవాల్సి ఉంటుంది.
  4. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. మీ వివరాలను నమోదు చేయాలి.
  5. మీ ఫొటో, సంతకాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  6. చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కితే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీకు అప్లికేషన్ నెంబర్ నెంబర్ జనరేట్ అవుతుంది.
  7. ఈ నెంబర్ ఆధారంగానే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

డిసెంబర్ 27న హాల్ టికెట్లు…

తెలంగాణ టెట్ 2025 దరఖాస్తులు
తెలంగాణ టెట్ 2025 దరఖాస్తులు

తెలంగాణ టెట్ అప్లికేషన్ ఫీజు కింద ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లు రాస్తే రూ.వెయ్యి చెల్లించాలి. డిసెంబర్ 27వ తేదీన టీజీ టెట్ - 2026 హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తారు.

  • టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు.
  • టెట్ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు.
  • టెట్ ఎగ్జామ్ లో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
  • ఈసారి కొత్తగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS) కేటగిరీని తీసుకొచ్చారు. ఇప్పటివరకు జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మాత్రమే ఉండేవి. ఈడబ్ల్యూఎస్‌ విభాగంలోనూ జనరల్‌ కేటగిరీ మాదిరిగానే 60 శాతం ఆపైన వస్తేనే ఉత్తీర్ణులవుతారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://tgtet.aptonline.in/tgtet/
  • అప్లికేషన్ డైరెక్ట్ లింక్ - https://tgtet.aptonline.in/tgtet/ApplicationFiling

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe