టీజీ టెట్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ విండో ఓపెన్ అయింది. ఇది జూలై 30 తేదీ వరకు కొనసాగుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ సమర్పణకు చివరి గడువు జూలై 29గానే ఉంటుంది. డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో 'ఎడిట్' అప్లికేషన్ సేవను ప్రారంభించినట్లు SCERT ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర చరిత్రలోనే ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించడం ఇదే తొలిసారి.

దరఖాస్తుల సమర్పణ జులై 22 నుంచి జులై 29 వరకు ఉండనుంది. ఆగస్టు 31 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబరు 7 నుంచి సెప్టెంబరు 11 వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్: 9.00 AM నుంచి 11.30 AM వరకు మధ్యాహ్నం సెషన్: 2.00 PM నుంచి 4.30 PM వరకు ఉంటుంది. సెప్టెంబరు 28 నుంచి 30 మధ్య ఫలితాలను ప్రకటిస్తారు.
జూలై 28 నాటికి పేపర్ I కోసం 1,705, పేపర్ II కోసం 11,634, రెండు పేపర్లకు కలిపి 2,703 దరఖాస్తులతో సహా మొత్తం 16,042 దరఖాస్తులు అందినట్లు పేర్కొంది. ఈ పరీక్ష ప్రభుత్వ, స్థానిక సంస్థల, TGTREIS, వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంస్థలు, మోడల్ పాఠశాలలు, ఇతర శాఖలచే నిర్వహించే పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం పరీక్ష ఉంటుంది.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు పేపర్-1, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు పేపర్-2 రాయాలి. ఎస్‌జీటీలుగా పనిచేస్తూ బీఈడీ విద్యార్హత ఉండి, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందాలనుకునే ఉపాధ్యాయులు పేపర్-2 పరీక్ష రాసేందుకు అర్హులు.
ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని సెప్టెంబరు 2028 నాటికి (మూడేళ్ల వ్యవధిలో) ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే ఉద్యోగంలో కొనసాగేందుకు వీల్లేదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా నిర్వహించే రెండు సాధారణ టెట్లతోపాటుగా ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా రెండు టెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పుడు తొలి ప్రత్యేక టెట్ నిర్వహిస్తోంది.
{{/usCountry}}ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని సెప్టెంబరు 2028 నాటికి (మూడేళ్ల వ్యవధిలో) ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే ఉద్యోగంలో కొనసాగేందుకు వీల్లేదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా నిర్వహించే రెండు సాధారణ టెట్లతోపాటుగా ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా రెండు టెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పుడు తొలి ప్రత్యేక టెట్ నిర్వహిస్తోంది.
{{/usCountry}}ఈ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు