TG TET Edit Option : టీజీ టెట్ ఎడిట్ ఆప్షన్ విండో ఓపెన్.. ఈ లింక్ క్లిక్ చేయండి
Telangana TET Notification 2026 : తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ తొలిసారిగా ప్రత్యేక ఇన్ సర్వీస్ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ప్రారంభమైంది.
టీజీ టెట్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ విండో ఓపెన్ అయింది. ఇది జూలై 30 తేదీ వరకు కొనసాగుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ సమర్పణకు చివరి గడువు జూలై 29గానే ఉంటుంది. డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో 'ఎడిట్' అప్లికేషన్ సేవను ప్రారంభించినట్లు SCERT ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర చరిత్రలోనే ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించడం ఇదే తొలిసారి.

దరఖాస్తుల సమర్పణ జులై 22 నుంచి జులై 29 వరకు ఉండనుంది. ఆగస్టు 31 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబరు 7 నుంచి సెప్టెంబరు 11 వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్: 9.00 AM నుంచి 11.30 AM వరకు మధ్యాహ్నం సెషన్: 2.00 PM నుంచి 4.30 PM వరకు ఉంటుంది. సెప్టెంబరు 28 నుంచి 30 మధ్య ఫలితాలను ప్రకటిస్తారు.
జూలై 28 నాటికి పేపర్ I కోసం 1,705, పేపర్ II కోసం 11,634, రెండు పేపర్లకు కలిపి 2,703 దరఖాస్తులతో సహా మొత్తం 16,042 దరఖాస్తులు అందినట్లు పేర్కొంది. ఈ పరీక్ష ప్రభుత్వ, స్థానిక సంస్థల, TGTREIS, వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంస్థలు, మోడల్ పాఠశాలలు, ఇతర శాఖలచే నిర్వహించే పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం పరీక్ష ఉంటుంది.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు పేపర్-1, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు పేపర్-2 రాయాలి. ఎస్‌జీటీలుగా పనిచేస్తూ బీఈడీ విద్యార్హత ఉండి, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందాలనుకునే ఉపాధ్యాయులు పేపర్-2 పరీక్ష రాసేందుకు అర్హులు.
ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని సెప్టెంబరు 2028 నాటికి (మూడేళ్ల వ్యవధిలో) ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే ఉద్యోగంలో కొనసాగేందుకు వీల్లేదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా నిర్వహించే రెండు సాధారణ టెట్‌లతోపాటుగా ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా రెండు టెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పుడు తొలి ప్రత్యేక టెట్ నిర్వహిస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


