...
...
Next Story

TG TET Applications : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ..! ఇక ఆలస్యం చేయకండి

TG TET Applications 2026: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2026) దరఖాస్తుల గడువు దగ్గరపడింది. ఇవాళ్టితో దరఖాస్తు సమయం ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Published on: Apr 30, 2026, 14:32:59 IST
Advertisement

TG TET 2026 Online Application : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే జూన్ సెషన్‌కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో (ఏప్రిల్ 30, గురువారం) ముగియనుంది. ఇప్పటికే లక్షలాది మంది దరఖాస్తు చేసుకోగా,…చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకముందే ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు అభ్యర్థులను కోరుతున్నారు.

ఇవాళే చివరి తేదీ…

టీజీ టెట్ (image istock)
టీజీ టెట్ (image istock)

విద్యాశాఖ విడుదల చేసిన టెట్ షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 15వ తేదీన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ (ఏప్రిల్ 30) రాత్రి 11:59 గంటల వరకు ఫీజు చెల్లింపుతో పాటు దరఖాస్తు సమర్పించేందుకు వీలుంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే సవరించుకునేందుకు ) ఏప్రిల్ 29 నుంచే అవకాశం కల్పించారు. ఈ ఎడిట్ ఆప్షన్ మే 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

దరఖాస్తుకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో…. దరఖాస్తు చేసుకోని వారు… వెంటనే ఫీజు చెల్లించి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ పెండింగ్‌లో ఉంచిన వారు తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తకముందే దరఖాస్తును సమర్పించడం ఉత్తమం.

టీజీ టెట్ దరఖాస్తు విధానం:

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందుగా నిర్ణీత పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన తర్వాత వచ్చే 'జర్నల్ నంబర్' ఆధారంగా పూర్తి వివరాలతో దరఖాస్తును సబ్మిట్ చేయాలి. కేవలం ఫీజు చెల్లించి వదిలేస్తే దరఖాస్తు పరిగణనలోకి తీసుకోబడదు.

  1. ముందుగా https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని అప్లికేషన్ ఫీజు లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
  3. ఆ తర్వాత అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవుతుంది.
  4. మీ వివరాలతో పాటు ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  5. చివరగా సబ్మిట్ చేస్తే మీ టెట్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.

టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్డామ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న టీచర్లకు కూడా టెట్‌ తప్పనిసరి కావడంతో చాలా మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe