TG TET Registration 2026: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగియనుంది. సమయం దగ్గరపడిన నేపథ్యంలో అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు, ఫీజు చెల్లించి అప్లికేషన్ పెండింగ్‌లో ఉంచిన వారు తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తకముందే దరఖాస్తును సమర్పించడం ఉత్తమం.
ముఖ్యమైన తేదీలు ఇవే:
- దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2026
- పరీక్ష నిర్వహణ: మే నెలలో నిర్ణీత తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో జరుగుతుంది.
- హాల్ టికెట్ల జారీ: పరీక్షకు వారం రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
టీజీ టెట్ దరఖాస్తు విధానం:
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందుగా నిర్ణీత పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన తర్వాత వచ్చే 'జర్నల్ నంబర్' ఆధారంగా పూర్తి వివరాలతో దరఖాస్తును సబ్మిట్ చేయాలి. కేవలం ఫీజు చెల్లించి వదిలేస్తే దరఖాస్తు పరిగణనలోకి తీసుకోబడదు.
- ముందుగా https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని అప్లికేషన్ ఫీజు లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవుతుంది.
- మీ వివరాలతో పాటు ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ టెట్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.
టీజీ టెట్ 2026 ఫీజు కింద…. జనరల్, బీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ. 750, రెండు పేపర్లకు కలిపి రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు అయితే ఒక పేపర్‌కు రూ. 700, రెండు పేపర్లకు కలిపి రూ. 950 చెల్లించాల్సి ఉంటుంది.
{{/usCountry}}టీజీ టెట్ 2026 ఫీజు కింద…. జనరల్, బీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ. 750, రెండు పేపర్లకు కలిపి రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు అయితే ఒక పేపర్‌కు రూ. 700, రెండు పేపర్లకు కలిపి రూ. 950 చెల్లించాల్సి ఉంటుంది.
{{/usCountry}}టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్డామ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి కావడంతో చాలా మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది.