...
...
Next Story

TG TET Results 2026 : నేడే తెలంగాణ టెట్ జూన్ 2026 ఫలితాల విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే!

TG TET June 2026 Results : తెలంగాణ టెట్ జూన్ 2026 ఫలితాలు ఈరోజు(జులై 13)న విడుదల కానున్నాయి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవాలి.

Updated on: Jul 13, 2026, 06:31:12 IST
Advertisement

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET - June 2026) రాసిన అభ్యర్థులకు కీలక అప్‌డేట్. విద్యాశాఖ సోమవారం (జూలై 13న) మధ్యాహ్నం 2:30 గంటలకు టెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి ఈ ఫలితాలను ప్రకటించనున్నారు.

తెలంగాణ టెట్ ఫలితాలు
తెలంగాణ టెట్ ఫలితాలు

ఈ ఏడాది జూన్ 16 నుండి జూన్ 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలను నిర్వహించారు. ఈ జూన్ సెషన్‌కు సంబంధించి మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రాథమిక తరగతుల (1 నుండి 5 తరగతులు) బోధనకు ఉద్దేశించిన పేపర్-1 పరీక్షకు 50,113 మంది, ఉన్నత ప్రాథమిక తరగతుల (6 నుండి 8 తరగతులు) బోధనకు ఉద్దేశించిన పేపర్-2 పరీక్షకు 1,03,639 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు.

అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది కాబట్టి అభ్యర్థులకు ఈ మార్కులు అత్యంత కీలకం. కాగా తెలంగాణ ప్రభుత్వం టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్‌కు లైఫ్‌టైమ్ (జీవితకాల) చెల్లుబాటు కల్పించిన సంగతి తెలిసిందే.

పరీక్ష ముగిసిన అనంతరం ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించిన విద్యాశాఖ, తుది కీతో పాటు ఫలితాలను కూడా ఇవాళే అందుబాటులో ఉంచనుంది. టెట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు తదుపరి వచ్చే ఉపాధ్యాయ నియామక పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు.

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాష్ట్రంలో ఉపాధ్యాయులు కావాలనుకునే వారికి అత్యంత ముఖ్యమైన పరీక్షలలో ఒకటి. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు, ప్రభుత్వం నోటిఫై చేసిన నియామక నిబంధనల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక, ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. అయితే టీజీ టెట్‌లో అర్హత సాధించడం ఉపాధ్యాయ ఉద్యోగానికి హామీ ఇవ్వదు, ఇది నియామకానికి కేవలం ఒక అర్హతా నిబంధన మాత్రమే.

టీజీ టెట్ స్కోర్ కార్డు మీద అభ్యర్థి పేరు, హాల్ టికెట్ నంబర్, పేపర్ I/పేపర్ II, పొందిన మార్కులు, శాతం, వర్గం, అర్హత స్థితి ఉంటాయి. అర్హత సాధించడానికి అభ్యర్థులు జనరల్ : 90 మార్కులు (60 శాతం), బీసీ: 75 మార్కులు (50 శాతం), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు: 60 మార్కులు (40 శాతం) సాధించాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe