తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TG TET) ఫలితాలను తెలంగాణ పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. తాజాగా పాఠశాల విద్యాశాఖ ఫలితాలను ప్రకటించింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in ద్వారా వారి లాగిన్ ఆధారాలను ఉపయోగించి వారి అర్హత స్థితిని చెక్ చేయవచ్చు. ఇటీవల టెట్ ప్రాథమిక కీ ని విడుదల చేశారు అధికారులు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. తాజాగా ఫలితాలు, కీ ని వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు.

గణాంకాల ప్రకారం 37,893 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులతో సహా మొత్తం 100,270 మంది అభ్యర్థులు (51.37 శాతం) అర్హత సాధించినట్లు ప్రకటించారు. తెలంగాణలోని పాఠశాలల్లో I నుండి VIII తరగతుల వరకు బోధించే ఉపాధ్యాయుల కోసం టీజీ టెట్ 2026 జనవరి 3 నుండి 20, 2026 వరకు జరిగింది.
ఫలితాలు ఎలా చూసుకోవాలి?
- అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/tgtet/ కు వెళ్లండి
- హోమ్‌పేజీలో TG TET ఫలితాలు 2026 లింక్ కోసం చూసి దానిపై క్లిక్ చేయండి.
- జర్నల్ నెంబర్/హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయండి.
- పేపర్ 1, పేపర్ 2లో ఏదో సెలక్ట్ చేసుకోండి. తర్వాత పుట్టిన తేదీ ఎంటర్ చేసి రిజల్ట్ చూసుకోవచ్చు.
- భవిష్యత్తు అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయండి.
ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలు నేరుగా చూసుకోండి
గతంతో పోల్చితే టీజీ టెట్ 2026కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. పేపర్1, 2 కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులున్నారు. టెట్ పరీక్షకు మెుత్తంగా 1,95,181 మంది హాజరు అవ్వగా.. ఇందులో 65,605 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు.
TG TET 2026 ఫలితాల ప్రకటన తర్వాత అర్హత కలిగిన అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలోని పాఠశాలల్లో బోధనా స్థానాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత వారు పత్రాలను ధృవీకరించేందుకు వెళ్లాలి. దీని తర్వాత అభ్యర్థులకు వారి నియామకాన్ని నిర్ధారిస్తూ నియామక లేఖలు జారీ చేస్తారు.
{{/usCountry}}TG TET 2026 ఫలితాల ప్రకటన తర్వాత అర్హత కలిగిన అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలోని పాఠశాలల్లో బోధనా స్థానాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత వారు పత్రాలను ధృవీకరించేందుకు వెళ్లాలి. దీని తర్వాత అభ్యర్థులకు వారి నియామకాన్ని నిర్ధారిస్తూ నియామక లేఖలు జారీ చేస్తారు.
{{/usCountry}}టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికే డీఎస్సీ రాసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు టెట్ స్కోర్ డీఎస్సీ పరీక్షలో కీలకంగా ఉంటుంది. డీఎస్సీ రిక్రూట్ మెంట్‌లో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా టీచర్లుగా పని చేయాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. టెట్ పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతుంటారు. అంతకుముందు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఈ పరీక్ష నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం ఏడాదిలో రెండు సార్లు టెట్ నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు పెడుతున్నారు.
TS TET 2026 గురించి అదనపు సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.inను సందర్శించండి.