...
...
Next Story

తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలకు అప్లయ్ చేశారా..? ఇవాళే చివరి తేదీ, ప్రాసెస్ ఇలా

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లో 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఇవాళ్టితో(నవంబర్ 6) ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు https://tgcab.bank.in/ వెబ్ సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.

Published on: Nov 6, 2025, 15:01:56 IST
Advertisement

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాల వారీగా 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీ అర్ధరాత్రిలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన వివరాలు:

  • హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లోని సహాకార బ్యాంకుల్లో కలిపి మొత్తం 225 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి.
  • ఖాళీలు : జిల్లా వారీగా ఖాళీలను చూస్తే… కరీంనగర్‌లో 43, హైదరాబాద్ లో 32 ఉన్నాయి. ఇక ఖమ్మం జిల్లాలో 99, వరంగల్ లో 21, మెదక్ లో 21 ఉండగా మహబూబ్‌నగర్ లో 9 పోస్టులున్నాయి.
  • అర్హతలు : ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులవుతారు.కేవలం డిగ్రీ మాత్రమే కాకుండా… తెలుగు భాషలో నైపుణ్యం ఉండాలి. ఆంగ్ల భాష పరిజ్ఞానం కూడా తప్పనిసరి.
  • వయోపరిమితి : దరఖాస్తుదారుడి వయసు 01.10.2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపులు ఉంటాయి.
  • ఎంపిక విధానం : రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
  • జీతం : ఎంపికైన వారికి నెలకు రూ.24,050 - రూ.64,480 మధ్య చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

దరఖాస్తు విధానం ఇలా:

  1. అభ్యర్థులు ముందుగా https://tgcab.bank.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా కనిపిస్తాయి.
  3. న్యూ రిజిస్ట్రేషన్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ జిల్లాల వారీగా వివరాలు ఉంటాయి.
  4. ముందుగా అప్లికేషన్ ఫీజు(జనరల్‌/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.250.) చెల్లించాలి.
  5. మీ ప్రాథమిక వివరాలు, ఫొటో, సంతకంతో పాటు పలు పత్రాలను అప్ లోడ్ చేయాలి.
  6. చివరిగా సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో 225 ఉద్యోగాలు
తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో 225 ఉద్యోగాలు
 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks