...
...
Next Story

టీజీఈఏపీసెట్ 2026 ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్..80167 భర్తీ, 14257 ఖాళీలు!

TGEAPCET-2026 ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో అందుబాటులో ఉన్న మొత్తం 94,424 సీట్లలో 80,167 సీట్లు భర్తీ అయ్యాయి.

Updated on: Jul 23, 2026, 16:31:13 IST
Advertisement

తెలంగాణ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈఏపిసెట్ (TGEAPCET-2026) రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కాలేజీల్లో అందుబాటులో ఉన్న మొత్తం 94,424 ఇంజనీరింగ్ సీట్లలో 80,167 సీట్లు భర్తీ అయినట్లు అధికారులు వెల్లడించారు.

టీజీఈఏపీసెట్ 2026 ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్
టీజీఈఏపీసెట్ 2026 ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్

అధికారిక వివరాల ప్రకారం, సర్టిఫికేట్ పరిశీలనకు మొత్తం 92,192 మంది అభ్యర్థులు హాజరయ్యారు (వీరిలో రెండో విడతలో కొత్తగా 2,731 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.). ఈ రెండో విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 60,792 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, రికార్డు స్థాయిలో 26.5 లక్షలకు పైగా ఛాయిస్‌లు నమోదయ్యాయి.

మొదటి విడతలో సీటు వచ్చి, రెండో విడతలో కూడా తమ పాత సీటునే ఉంచుకున్న అభ్యర్థులు 37,442గా ఉన్నారు. మెరుగైన ఆప్షన్ల ద్వారా సీటు పొందినవారు 34,828. ఈ విడతలో మొదటిసారి సీటు సాధించినవారు సంఖ్య 7,897గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,329 మంది అభ్యర్థులకు సీట్లు లభించాయి.

రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ఇంకా 14,257 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల పట్ల విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో మొత్తం 86,387 సీట్లలో 73,874 సీట్లు (85.5 శాతం) భర్తీ అయ్యాయి.

ప్రైవేట్ యూనివర్సిటీల్లో అందుబాటులోని 1,386 సీట్లలో 1,384 సీట్లు (99.9 శాతం) దాదాపు పూర్తి స్థాయిలో భర్తీ కావడం విశేషం. యూనివర్సిటీ కాలేజీలు 6,437 సీట్లలో 4,853 సీట్లు (75.4 శాతం) భర్తీ అయ్యాయి. ప్రభుత్వ కళాశాలలు అత్యల్పంగా 214 సీట్లలో కేవలం 56 సీట్లు (26.2 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks