TGPSC Keys : పీసీబీ అసిస్టెంట్ సైంటిస్ట్ ఎగ్జామ్ అప్డేట్ - ప్రాథమిక కీ విడుదల! ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ సైంటిస్ట్ పరీక్షల ప్రాథమిక కీని టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యంతరాలను అక్టోబర్ 30 సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

Published on: Oct 28, 2026, 11:19:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)లో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2) పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 24న నిర్వహించిన పేపర్-1, పేపర్-2 పరీక్షల ప్రాథమిక 'కీ' (Preliminary Key)ని టీజీపీఎస్సీ విడుదల చేసింది.

టీజీపీఎస్సీ
టీజీపీఎస్సీ

పరీక్షకు హాజరైన అభ్యర్థులు మాస్టర్ ప్రశ్నాపత్రాలను, ప్రాథమిక కీని టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ లాగిన్ వివరాల ఆధారంగా…. ఈ నెల 30వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో మాస్టర్ క్వశ్చన్ పేపర్లను పొందే సౌకర్యాన్ని కల్పించారు.

అభ్యంతరాల నమోదుకు గడువు.. రుసుము వివరాలు

ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా కమిషన్‌కు తెలియజేయవచ్చు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అభ్యంతరాలను సమర్పించాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చిన విజ్ఞప్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని పేర్కొంది.

అభ్యంతరాలు వ్యక్తం చేసే ప్రతి ప్రశ్నకు రూ.500 చొప్పున అభ్యంతర రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారానే చెల్లించాలని అధికారులు తెలిపారు. అభ్యర్థి లేవనెత్తిన అభ్యంతరం సరైనదేనని నిపుణుల కమిటీ నిర్ధారిస్తే.. వారు చెల్లించిన రూ.500 రుసుమును తిరిగి వారి ఖాతాలో జమ చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది. సరైన ఆధారాధారాలతో ఆన్‌లైన్ విధానంలోనే అభ్యంతరాలను అప్‌లోడ్ చేయాలని సూచించింది.

ప్రాథమిక కీ డౌన్లోడ్ ఇలా…

  • ముందుగా https://www.tgpsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • Assistant Scientist Key లింక్ పై క్లిక్ చేయాలి.
  • టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్ చేస్తే ప్రాథమిక కీలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కీ కాపీలను పొందొచ్చు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More