TGPSC Exams Schedule 2026 : టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల - ఈ తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు!

TGPSC Exam Schedule 2026 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  వివిధ ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను ప్రకటించింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో కంప్యూటర్ ఆధారిత (CBT) పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

Published on: Sep 28, 2026, 16:03:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

TGPSC Exam Schedule 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ అందించింది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఆధారంగా రిక్రూట్‌మెంట్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత టెస్ట్ (CBT) విధానంలోనే జరుగుతాయని కమిషన్ స్పష్టం చేసింది. పోస్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి….

TGPSC పరీక్షల షెడ్యూల్ విడుదల
TGPSC పరీక్షల షెడ్యూల్ విడుదల

పీసీబీ అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II):

  • తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీకి అక్టోబర్ 24, 2026న సీబీటీ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు.
  • అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ : పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోనే అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులకు అక్టోబర్ 26, 2026న పరీక్ష జరగనుంది.
  • ఆర్ అండ్ బి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) : రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (సివిల్) పోస్టులకు నవంబర్ 06 మరియు నవంబర్ 07, 2026 తేదీల్లో రెండు రోజుల పాటు సీబీటీ పరీక్షలు నిర్వహిస్తారు.

డిప్యూటీ ఈఓ / గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-I:

పాఠశాల విద్యాశాఖలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (DEO) మరియు గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-I పోస్టులకు నవంబర్ 12, 13 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. అభ్యర్థులు ఈ పరీక్షలు సీబీటీ విధానంలోనే జరుగుతాయనే విషయాన్ని గమనించి…. తదనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేసుకోవాలని కమిషన్ సూచించింది. హాక్ టికెట్లు, పరీక్షా కేంద్రాల సమాచారాన్ని త్వరలోనే టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More