...
...
Next Story

TGPSC Recruitment 2026 : టీజీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ల అప్డేట్ - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం, ముఖ్య తేదీలు

TGPSC Recruitment 2026 : తెలంగాణలో కొలువుల భర్తీ ప్రక్రియ మళ్లీ షురూ అయింది.ఇటీవలే టీజీపీఎస్సీ నుంచి విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. https://www.tgpsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.

Published on: Jun 8, 2026, 09:16:16 IST
Advertisement

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే వివిధ శాఖల్లో కొలువుదీరాలనుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం మొత్తం 290 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కమిషన్ మూడు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసింది.

టీజీపీఎస్సీ
టీజీపీఎస్సీ

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం విడుదలైన మూడు నోటిఫికేషన్లలో రోడ్లు, భవనాల (R&B) శాఖలోనే అత్యధికంగా ఉద్యోగాలు ఉన్నాయి.

మొదటి నోటిఫికేషన్ ద్వారా ఆర్ అండ్ బీ శాఖలోని 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (సివిల్) పోస్టులను భర్తీ చేస్తారు. రెండో నోటిఫికేషన్ కింద అదే శాఖలో ఉన్న 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) లో ఖాళీగా ఉన్న 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం మూడో నోటిఫికేషన్ ను జారీ చేశారు.

ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల వయస్సు 2026 జులై 1 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే గరిష్ట వయస్సు 44 సంవత్సరాల లోపు ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఉద్యోగులకు) గరిష్ట వయోపరిమితిలో చట్టబద్ధమైన సడలింపులు యథావిధిగా వర్తిస్తాయి.

దరఖాస్తులు ప్రారంభం - తేదీలు

అభ్యర్థుల సౌకర్యార్థం అలాగే సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వేర్వేరు పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను వేర్వేరు తేదీల్లో టీజీపీఎస్సీ ప్రారంభించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

  • ఆర్ అండ్ బీ సివిల్ పోస్టులు (222 ఖాళీలు ): ఈ పోస్టులకు జూన్ 06 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు జూలై 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
  • ఆర్ అండ్ బీ ఎలక్ట్రికల్ పోస్టులు (49 ఖాళీలు) : ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ఇవాళ్టి నుంచే (జూన్ 8) మొదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 15 ఆఖరి తేదీగా నిర్ణయించారు.
  • అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులు (19 ఖాళీలు) : కాలుష్య నియంత్రణ మండలిలోని ఈ ఉద్యోగాలకు జూన్ 10 నుండి ఆన్‌లైన్ లింక్ అందుబాటులోకి రానుంది. ఈ పోస్టులకు జూలై 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks