టీజీపీఎస్సీ నుంచి కీలక అప్డేట్.. ఆ ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు
TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని పోస్టుల దరఖాస్తుకు గడువు తేదీని పొడిగించింది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీని పొడిగిస్తున్నట్లు కమిషన్ అధికారికంగా ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు ఈ పొడిగించిన గడువును ఉపయోగించుకుని అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ నెం. 01/OG/PC/2026 ప్రకారం.. మొదట ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 27 నుండి మే 25 వరకు మాత్రమే సమయం ఇచ్చారు. అయితే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ మే 18, 2026న జారీ చేసిన G.O.Ms.No.86 ప్రకారం గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీంతో కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకుగానూ దరఖాస్తు గడువును జూన్ 2, 2026 సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in) లో తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ఐడీ ద్వారా లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సవరించిన గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. ఎందుకంటే చివరి నిమిషంలో సర్వర్ బిజీ లేదా సాంకేతిక సమస్యలను వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు జూన్ 2వ తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా తమ ఆన్‌లైన్ అప్లికేషన్లను సమర్పించాలని టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. అర్హత, సిలబస్ పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించగలరు.
ముఖ్యమైన వివరాలు
- పోస్టు పేరు: అసిస్టెంట్ సైంటిస్ట్ (Analyst Grade-II)
- కొత్త దరఖాస్తు చివరి తేదీ: జూన్ 2, 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
- వయోపరిమితి సడలింపు: రిజర్వేషన్ వర్గాలకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు) ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనంగా మరో 5 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


