TGPSC Assistant Scientist Notification 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు టీజీపీఎస్సీ శుభవార్త చెప్పింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 20 ఖాళీలను భర్తీ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ ప్రకారం…. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 27, 2026 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి మే 25, 2026 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది. ఇక ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్షను జూలై 2026లో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in) సందర్శించాలి. ఇప్పటికే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకున్న వారు తమ ఐడీతో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా దరఖాస్తు చేసే వారు మొదట ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సమాచారంలో ఏవైనా తప్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకున్న తర్వాతే ఫైనల్ సబ్మిషన్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
రాత పరీక్ష….
ఈ రాత పరీక్షను కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) పద్ధతిలో నిర్వహించనున్నారు. పరీక్షను వివిధ సెషన్లలో నిర్వహించే అవకాశం ఉన్నందున, అభ్యర్థుల మార్కులను 'నార్మలైజేషన్' (Normalization) పద్ధతిలో లెక్కిస్తారు. రాత పరీక్షకు వారం రోజుల ముందు నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వికలాంగులైన అభ్యర్థులకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సహాయకులను (Scribe) ఏర్పాటు చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులకు టీజీపీఎస్సీనే స్క్రైబ్లను కేటాయిస్తుంది. అలాగే వీరికి పరీక్షా సమయంలో అదనపు సమయం కూడా లభిస్తుంది.
{{/usCountry}}వికలాంగులైన అభ్యర్థులకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సహాయకులను (Scribe) ఏర్పాటు చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులకు టీజీపీఎస్సీనే స్క్రైబ్లను కేటాయిస్తుంది. అలాగే వీరికి పరీక్షా సమయంలో అదనపు సమయం కూడా లభిస్తుంది.
{{/usCountry}}