తెలంగాణలో 3 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల.. తేదీలు, పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణలో 3 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి, ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు చూడండి.
తెలంగాణలోని నిరుద్యోగ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ కీలక శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 290 అసిస్టెంట్ ఇంజినీర్ (AE/AEE) స్థాయి పోస్టుల భర్తీ కోసం మూడు వేర్వేరు నియామక నోటిఫికేషన్లను విడుదల చేసింది. ప్రభుత్వ కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.

ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన ఖాళీలు, అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు తేదీలు, ఎంపిక విధానం వంటి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి. మొత్తం ఖాళీలు 290 ఉన్నాయి.
శాఖల వారీగా ఖాళీల వివరాలు
ఈ నియామక ప్రక్రియ ద్వారా రోడ్లు, భవనాల శాఖ (R&B)తో పాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) 222 పోస్టులు ఉన్నాయి.
- రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)లో 49 పోస్టులు ఉన్నాయి.
- తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ 19 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది.
విద్యా అర్హతలు
పోస్టుల బట్టి అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఏఎంఐఈ పూర్తి చేసి ఉండాలి.
- ఎలక్ట్రికల్ పోస్టులకు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE) విభాగంలో డిగ్రీ కలిగి ఉండాలి.
- అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టుకు సివిల్, మెకానికల్, కెమికల్, మైనింగ్, బయోటెక్నాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా దానికి సమానమైన పీజీ (PG) అర్హత ఉండాలి.
వయోపరిమితి
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గరిష్ఠ వయోపరిమితిని 34 సంవత్సరాల నుండి 44 ఏళ్లకు పెంచడం వల్ల ఈసారి వేలాది మంది అదనపు అభ్యర్థులకు పరీక్ష రాసే అవకాశం లభించింది. 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, అలాగే దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా కేవలం ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వారీగా దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఇలా ఉన్నాయి:
- సివిల్ పోస్టులు: జూన్ 6 నుండి ప్రారంభమై జులై 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎలక్ట్రికల్ పోస్టులు: జూన్ 8 నుండి ప్రారంభమై జులై 15 వరకు అవకాశం ఉంటుంది.
- ఎన్విరాన్‌మెంటల్ పోస్టులు: జూన్ 10 నుండి ప్రారంభమై జులై 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలోనే ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది. నెలకు రూ. 54,220 నుండి రూ. 1,33,630 వరకు పే స్కేల్ వర్తిస్తుంది.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. టీజీపీఎస్‌సీ ప్రకటించిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం.. అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పరీక్షను సెప్టెంబర్ 2026 లో నిర్వహిస్తారు. సివిల్ మరియు ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టుల పరీక్షలను అక్టోబర్ 2026 లో నిర్వహించనున్నారు.
సిలబస్, పరీక్షా విధానం, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక పోర్టల్‌ను సందర్శించవచ్చు. పరీక్షలకు సన్నద్ధం కావడానికి అభ్యర్థులకు తగినంత సమయం ఉన్నందున ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించడం ఉత్తమం.
అధికారిక పోర్టల్ : https://www.tgpsc.gov.in/
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


